Automobile Exports From India: ఆటో రంగంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంచలనం నమోదు అవుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలలు ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా మంచివి. ఈ కాలంలో ఆటోమొబైల్ ఎగుమతుల్లో 14 శాతం పెరుగుదల నమోదైంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది.


ఆరు నెలల్లోనే 25 లక్షలకు పైగా...
ఎస్ఐఏఎమ్ డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 25,28,248 యూనిట్ల వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 14 శాతం ఎక్కువ. సియామ్ ప్రెసిడెంట్ ప్రకారం భారతదేశం నుంచి ఎగుమతులు వేగంగా పెరిగాయి. వివిధ కారణాల వల్ల లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లు గత కొన్నేళ్లుగా మాంద్యంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత కొన్నేళ్ల డేటాను పరిశీలిస్తే ఆటోమొబైల్ ఎగుమతులు క్షీణించాయి.


గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 45 లక్షల యూనిట్లు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 47 లక్షలకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్-సెప్టెంబర్) ప్యాసింజర్ కార్ల రవాణా ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగింది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు ఎగుమతి చేసింది?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అత్యధిక ప్యాసింజర్ కార్లను ఎగుమతి చేసింది. 1,47,063 వాహనాల రవాణాతో కంపెనీ అగ్రస్థానంలో ఉంది. గతేడాది ఇదే సమయంలో ఎగుమతి చేసిన వాహనాల యూనిట్లు 1,31,546గా ఉంది.


84,900 కార్లను ఎగుమతి చేసిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎగుమతుల పరంగా రెండో స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎగుమతి చేసిన వాహనాలు 86,105 యూనిట్లు అంటే దాదాపు ఒక శాతం తక్కువ. ప్రతి సంవత్సరానికి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వాహనాలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచ ఆటో మార్కెట్లో భారత్ నుంచి వెళ్లే వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని అనుకోవచ్చు.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?