ABP Southern Rising Summit 2024: దేశంలో దక్షిణాదికి ఓ ప్రత్యేకత ఉంది. అభివృద్ధిలో ముందడుగు వేయడం, ప్రాంతీయ ప్రత్యేకతలను నిలుపుకోవడమే కాదు ప్రతి రంగంలోనూ ఇప్పుడు దక్షిణాది పురోగమిస్తోంది. దక్షిణాది అభివృద్ధిని దేశానికి చాటిచెప్పేలా ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో రెండో సదరన్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. "Coming of Age: Identity, Inspiration, Impact" థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం
2023లో సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ప్రస్తుత డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సహా భిన్నరంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో దేశం ముందుకెళ్తున్న వైనం, అందులో దక్షిణాది పాత్రపై విశేషంగా చర్చించారు. ఈ ఏడాది ఈ సమ్మిట్ ను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమ్మిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇరవై శాతం మంది జనాభా ఉంటారు. దేశం మొత్తం జీడీపీలో 31 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. అంటే భారత ఎకానమీకి దక్షిణాది రాష్ట్రాలు కీలకమైనవి అనుకోవచ్చు. 2030 నాటికి భారత జీడీపీలో దక్షిణాది వాటా 35 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తరభారతంతో పోలిస్తే దేశంలో దక్షిణాదిన ఎక్కువ చైతన్యంగా ఉంటారు. కుటుంబనియంత్రణ పాటించారు. దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండడమే దీనికి కారణం అదేనని డేటా సైంటిస్ట్ ఆర్‌ఎస్ నీలకందన్ విశ్లేషించారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే దక్షిణ భారతదేశంలో శిశు మరణాల రేటు తక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో మరణించే అవకాశం చాలా తక్కువ. బిడ్డకు టీకాలు వేయించే అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పిల్లలకు సేవలు , చిన్నతనంలో అద్భుతమైన పోషకాహారం అందుతాయని అందుకే దక్షిణాది యువత చురుకుగా ఉంటారన్నారు.
దక్షిణాదిలో సినిమా పరిశ్రమ కూడా మంచి పురోగతి సాధించింది. వ్యాపారంలోనూ దక్షిణాదికి చెందిన వారు అంతర్జాతీయంగా అత్యుత్తమ కంపెనీల్లో అత్యున్నత స్థానానికి వెళ్తున్నారు. వాటి మూలాలతో బలంగా ముడిపడి ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ ఉన్నత స్థానంలోనే ఉంటాయని అనుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వంలోనూ ఇప్పడు దక్షిణాది పార్టీలదే కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక ఐక్యత, విద్య , ఆరోగ్యంపై పెట్టుబడి వంటి వినూత్న పాలనా నమూనాలను అందించడానిక ప్రయత్నిస్తున్నాయి.
25వ తేదీన సదరన్ రైజింగ్ దక్షిణాది ఆశలు, ఆకాంక్షలను మరోసారి వ్యక్తపరచనుంది. దక్షిణాదిలో ఏబీపీ నిర్వహిస్తున్న రెండో సమ్మిట్ “Coming of Age: Identity, Inspiration, Impact” ధీమ్‌తో రాజకీయ, సాంస్కృతి, ఆర్థిక, సోషల్ డెవలప్‌మెంట్స్ పై చర్చిస్తుంది.
అక్టోబర్ 25, 2024న సదరన్ రైజింగ్ సమ్మిట్ లో చేంజ్ మేకర్స్, విజరనీస్ ఆఫ్ సౌత్ ఇండియాలో వస్తున్న మార్పులు..జరగాల్సిన అభివృద్ది .. మెరుగైన భవిష్యత్ కోసం ఏబీపీ లైవ్‌ను ఫాలో అవ్వండి.