Motorcycle And Car Petrol Tank: మోటార్ సైకిల్ లేదా ఏదైనా వాహనంలో పెట్రోల్, డీజిల్ నింపేటప్పుడు వాహనం ఇంధన ట్యాంక్ దాని సామర్థ్యానికి మించి నింపకూడదని గుర్తుంచుకోవాలి. ట్యాంక్ సామర్థ్యం కంటే ఎక్కువ ఇంధనాన్ని నింపినట్లయితే అప్పుడు పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇలా జరగడానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాహన కంపెనీలు ఏదైనా వాహనం ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని 10 నుంచి 15 శాతం తక్కువగా అంచనా వేస్తారు. తద్వారా ప్రజలు తమ ఫ్యూయల్ ట్యాంక్‌ను వాహన తయారీదారులు పేర్కొన్న సామర్థ్యానికి అనుగుణంగా నింపుతారు. మీరు మీ మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ నింపడానికి వెళ్లి ట్యాంక్ ఫుల్ చేయమని పెట్రోల్ బంకులో అడిగారని అనుకుందాం. పెట్రోల్ బంకులో ఉన్న వ్యక్తి మీ మోటార్‌సైకిల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు అయితే వాహనంలోని పెట్రోల్ దాదాపు 11 లీటర్లు అని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు కెపాసిటీ కంటే ఎక్కువ పెట్రోల్ ఎలా నింపవచ్చు అని మీరు ఆలోచిస్తారు. దీని వెనుక కారణం ఏమిటంటే వాహన తయారీదారులు ఉద్దేశపూర్వకంగా ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని తక్కువగా చూపిస్తారు. దీని ద్వారా ప్రజలు ఆ పరిమితికి మించి ట్యాంక్‌ను నింపరని మేకర్స్ భావిస్తారు.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ట్యాంక్ ఫుల్ ఎందుకు చేయకూడదు?
పెట్రోల్ బంకులో భూగర్భ ట్యాంక్ లోపల నిల్వ చేసిన పెట్రోల్, డీజిల్ ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. అయితే బయటి వాతావరణంలోకి వచ్చినప్పుడు దాని ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లేదా డీజిల్ బయటకు వచ్చిన తర్వాత దానికి బయటి గాలి తగిలినప్పుడు దాని వాల్యూమ్ పెరుగుతుంది. ఇది ఇంధనం లీకేజీ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల పెట్రోల్ లేదా డీజిల్ దాని సామర్థ్యం కంటే తక్కువ మోటార్ సైకిల్ లేదా కారులో నింపవచ్చు.
పెట్రోల్ లేదా డీజిల్ నుంచి వచ్చే ఆవిరికి ఫ్యూయల్ ట్యాంక్ లోపల వాక్యూమ్ కూడా అవసరం. ట్యాంక్‌ను పూర్తిగా నింపిన తర్వాత పెట్రోల్‌కు ఆ వాక్యూమ్ లభించదు. దీని కారణంగా ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. అప్పుడు కాలుష్యం కూడా పెరుగుతుంది. మోటార్‌సైకిల్ ట్యాంక్ పూర్తిగా నిండిపోయి పార్కింగ్ చేస్తున్నప్పుడు దాన్ని వంచి సైడ్ స్టాండ్‌పై పెడితే లీకేజీ అయ్యే అవకాశం ఉందని దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!