Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?

Bajaj Chetak 35 Series: బజాజ్ చేతక్ 35 సిరీస్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటి ధర రూ.1.2 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Continues below advertisement

New Bajaj Chetak 35 Series: బజాజ్ ఆటో మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. బజాజ్ లాంచ్ చేసిన ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల అయింది. బజాజ్ కొత్త చేతక్‌లో చాలా మార్పులు చేసింది. ఈ స్కూటర్ 35 సిరీస్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని రీ లొకేట్ చేయడం ద్వారా దాని బూట్ కెపాసిటీ 35 లీటర్లు అయింది.

Continues below advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ ఎంత?
బజాజ్ లాంచ్ చేసిన ఈ కొత్త మోడల్‌లో 4కేడబ్ల్యూ పర్మినెంట్ మాగ్నెట్ మోటార్ ఉంది. ఈ మోటారుతో ఈవీని గరిష్టంగా గంటకు 73 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు. చేతక్ 35 సిరీస్‌లో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని 153 కిలోమీటర్ల వరకు నడపవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ బ్యాటరీని 950W ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. ఇది 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి మూడు గంటలు పడుతుంది. 

చేతక్ ఈవీ ఫీచర్లు ఇవే...
బజాజ్ తన కొత్త స్కూటర్ డిజైన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ప్రజలను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ ఈవీలో హెడ్‌ల్యాంప్‌ల విషయంలో మార్పులు చేశారు. స్కూటర్‌లో కొత్త టెయిల్‌ల్యాంప్, కొత్త ఇండికేటర్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు పొడవుగా ఉంది. అలాగే 80 మిల్లీమీటర్ల పొడవైన వీల్‌బేస్ కూడా అందించారు.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

బజాజ్ చేతక్ 35 సిరీస్ కొత్త ఫీచర్ల గురించి మాట్లాడుతూ దాని టాప్ ఎండ్ మోడల్ 3501 ట్రిమ్ జియో ఫెన్సింగ్‌తో కూడిన కొత్త టచ్‌స్క్రీన్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మ్యాప్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇది ఓవర్ స్పీడ్ విషయంలో రైడర్‌ను కూడా హెచ్చరిస్తుంది.

చేతక్ 35 సిరీస్ ధర
ఈ కొత్త చేతక్‌లోని ఫీచర్లతో బజాజ్ ఇప్పుడు ఏథర్, ఓలా స్కూటర్‌లకు గట్టి పోటీని ఇవ్వగలదు. గత కొన్ని నెలల్లో మూడు లక్షలకు పైగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. చేతక్ 35 సిరీస్ మిడ్ వేరియంట్ ధర రూ. 1.20 లక్షలుగా ఉంది. దాని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1.27 లక్షలుగా ఉంది. బజాజ్ ఈ కొత్త తరం మోడల్‌ను మరింత ఎక్స్‌ప్యాండ్ చేయాలని అనుకుంటోంది.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

Continues below advertisement
Sponsored Links by Taboola