Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ఫారెనర్స్‌ని మీటింగ్ కోసం ఇంటికే పిలిచానని వివికే అంటే మిత్ర ఒకే అంటాడు. లక్ష్మీ కూడా మంచి నిర్ణయం అని వివేక్‌తో చెప్పి వాళ్ల కోసం ఫుడ్ కూడా ఏర్పాటు చేద్దామని అంటుంది. జానుని పిలిచి వంట చేయమని చెప్తుంది. మిత్ర, వివేక్‌లు కూడా జాను వంట సూపర్ అని పొగిడేస్తారు. ఇక వివేక్ అందుకు సంబంధించిన ఫైల్ చెక్ చేసి మళ్లీ తన బీరువాలోనే పెట్టేస్తాడు. మనీషా చూసి ఈ అవకాశాన్ని వాడుకుంటా అనుకొని ఆ ఫైల్ తీసేస్తుంది. కిచెన్‌లో వంట చేస్తున్న జాను దగ్గరకు మనీషా వెళ్లి వంటలు ఎవరి కోసం అని అడిగి మీ అక్క అక్కడ ఫారెన్‌ కంపెనీ వాళ్లతో మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ వంటలు చేస్తున్నావ్ పేరుకే మీరు అక్కాచెల్లెళ్లు కానీ మీ అక్క మాత్రం బాస్ నువ్వు బానిస అని అంటుంది. దానికి జాను మా అత్తయ్య ఖాళీగా లేదా నా దగ్గరకు వచ్చావ్ అంటుంది. మనీషా ఇంకా ఎక్కించే ప్రయత్నం చేసినా జాను అవేవీ పట్టించుకోకుండా డెలికేట్స్ కోసం జ్యూస్ సిద్ధం చేస్తుంది. ఇక లక్ష్మీ వాళ్లకి ప్రాజెక్ట్ డిజైన్స్ వివరిస్తుంది. వాళ్లు ఇంప్రెస్ అవుతారు.


ఇక మనీషా, జాను ఇద్దరూ వాళ్లకోసం స్నాక్స్ తీసుకొస్తారు. జాను జూస్ ఇస్తుంటే మనీషా కావాలనే నెట్టేస్తుంది. జూస్ ఒకాయన మీద పడిపోతుంది. అందరి ముందు లక్ష్మీ నానుని కళ్లు కనిపించడం లేదా బుద్ధి లేదా అని తిడుతుంది. తర్వాత టేబుల్ క్లీన్ చేయమని చెప్తుంది. జాను తలాడించి వెళ్లిపోతుంది. తర్వాత వాళ్లు డిజైన్స్ చూపించమంటే వివేక్ ఫైల్ ఇస్తాడు. అది చూసి ఫారెన్ కంపెనీ వాళ్లు కోపంగా డిజైన్స్ అని చెప్పి పిల్లలు గీసుకున్న బొమ్మలు చూపించారేంటి అని అడుగుతారు. లక్ష్మీ, మిత్ర, వివేక్ ఫైల్ చూసి షాక్ అయిపోతారు. వివేక్‌ని మిత్ర, లక్ష్మీ ఇద్దరూ తిడతారు. వివేక్‌ నోరు ఎత్తకుండా లక్ష్మీ తిట్టడం చూసిన జాను ఫీలవుతుంది. మనీషా తన ప్లాన్ సక్సెస్ అయిందని సంతోష పడుతుంది. సిన్సియర్‌గా లేరని వాళ్లు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నామని అంటారు. లక్ష్మీ రెండు నిమిషాల టైం అడిగి వివేక్‌కి ఫైల్ తీసుకురమ్మని చెప్తుంది. వివేక్‌ పరుగున వెళ్లి ఫైల్ తీసుకొస్తాడు. వాళ్లు అది చూసి ప్రాజెక్ట్ ఒకే చేస్తారు.   


మనీషా: ఇప్పుడు అంతా జరిగింది చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది జాను. ఇంకా నువ్వు మీ అక్క సమానమే అనుకుంటున్నావా. మిత్ర, వివేక్ ఒకటే అనుకుంటున్నావా. వాళ్ల దృష్టిలో మీరు ఏంటో ఇప్పటికైనా అర్థమైందా. పొరపాటున జూస్ చేయి జారితే నువ్వు పని మనిషి అయినట్లు తను మేనేజర్‌లా తిట్టింది. ఇక వివేక్‌ని సొంత మరిది అని చూడకుండా తిట్టేసింది. ప్రాజెక్ట్ కోసం మీ పరువు మర్యాదలు తాకట్టు పెట్టేసింది. పాపం ఇందాక  వివేక్‌ని చూస్తే జాలేసింది. తను కంపెనీ డైరెక్టర్‌ అయి కూడా సర్వెంట్‌లా నిల్చొన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్లో నీకు వివేక్‌కి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. ఇదంతా ఈ రోజు జరిగింది ఇంతకు ముందు జరిగింది ఇక పైన జరుగుతుంది. నువ్వు వివేక్ ఈ ఇంటి మనుషులో పని మనుషులో నువ్వే తేల్చుకో. 


రాత్రి లక్ష్మీ, మిత్ర, వివేక్‌లు జయదేవ్ ఉదయం ఇంటి నుంచి వెళ్లి ఇంకా రాలేదని ఆలోచిస్తూ ఉంటారు. ఇక జాను కిచెన్‌లో పాలు వేడి చేస్తూ మనీషా మాటలు తలచుకొని ఆలోచనలో పడుతుంది. మనీషా మళ్లీ వచ్చి నీ జీవితం కిచెన్‌కే పరిమితం అయిపోయిందని అంటుంది. ఇక వివేక్ ఫైల్‌ గురించి సారీ చెప్తే మళ్లీ లక్ష్మీ నువ్వు చూసుకోవాలి కదా అంటుంది. ఆ మాటతో మనీషా జానుని రెచ్చగొడుతుంది. పిల్లలు మీ గదికి ఎందుకు రానిస్తున్నారని అంటుంది. లక్ష్మీ కాంట్రాక్ట్ రాకపోతే పరువు పోతుందని అంటుంది. ముందు అలా జరగకుండా బాగుండేది అని అంటుంది.



జానుని ఫుల్లుగా మనీషా రెచ్చగొడుతుంది. అది మీ అక్క ఇక నువ్వు మీ వివేక్‌ బాగు పడినట్లే అని అంటుంది. ఇక లక్ష్మీ పిల్లలకు పాలు ఇచ్చావా అని జానుని అడుగుతుంది. దాంతో జాను కోపంగా పాలు సింక్‌లో పడేసి పాలు లేవు అక్క విరిగిపోయావని అంటుంది. జాను మనసు విరిగిందని మనీషా అనుకుంటుంది. ఇక ఉదయం జాను వివేక్‌, దేవయానికి టిఫెన్ పెడుతుంది. మిత్ర, లక్ష్మీలు పిలవడంతో వివేక్‌ ప్లేట్‌లో కడిగేసి వెళ్లిపోతాడు. దేవయాని కూడా తింటుంటే పిలిచేశారని సగంలో వదిలేసి వెళ్లిపోయాడని అంటుంది. మనీషా రెచ్చగొట్టడంతో వివేక్‌ వాళ్ల డ్రైవరో వారసుడో తెలీడం లేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: భార్య, మామల్ని దారుణంగా అపార్థం చేసుకున్న రాజు.. తండ్రిని చేరిన పసికందు!