Weekly Horoscope 2024 March 17 to March 23 : మార్చి 17 ఆదివారం నుంచి మార్చి 23 శనివారం వరకూ వారఫలాలు...


మేష రాశి వారఫలం
ఈ వారం మీకు కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో వచ్చే మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గురువారం నుంచి శనివారం వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం సాధారణంగా సాగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని  జపించండి. ( ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి వారఫలం
ఈ వారం మొత్తం మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం బావుంటుంది.  ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి.  పాత వివాదాలను పరిష్కరించుకోవడంలో సక్సెస్ అవుతారు. బుధ, గురువారాలు శుభప్రదంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. నూతన పెట్టుబడుు పెట్టేముందు మరోసారి ఆలోచించడం మంచిది. రావిచెట్టుకి నీళ్లు పోసి..చీమలకు పంచదార పెట్టండి.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


మిథున రాశి వారఫలం
ఈ వారం మీరు కెరీర్లో పెద్ద అవకాశాలు పొందొచ్చు. వారం ప్రారంభం చాలా బావుంటుంది. కార్యాలయంలో మీ హార్డ్ వర్క్ , టీమ్ స్పిరిట్ ప్రశంసలు అందుకుంటాయి.  మీ జీవిత భాగస్వామిపై అవగాహన పెరుగుతుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఆది, సోమ, శుక్రవారాలు చాలా శుభప్రదమైనవి. అయితే మీరు మీ స్వభావాన్ని పని తీరును మార్చుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకూడదు. విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆవులకు మేత వేయండి. (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి వారఫలం
ఈ వారం మీకు చాలా ముఖ్యమైన పనులు చిన్న ప్రయత్నంతో నెరవేరుతాయి.  శ్రేయోభిలాషులు మిమ్మల్ని అభినందిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఈ వారంలో కొత్త స్టార్టప్ ప్రారంభించవచ్చు. విదేశీ కంపెనీలలో పనిచేసే వారికి ఈ వారం చాలా అనుకూలం. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు తిరిగి పొందుతారు. బుధ, గురువారాలు మీకు శుభప్రదంగా ఉంటాయి. అయితే ఖరీదైన వస్తువుల కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి.  కంటికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. చెడు అలవాట్ల నుంచి పిల్లల్ని దూరం చేసేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శివారాధన శుభం.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)


సింహ రాశి వారఫలం
పెండింగ్ పడిన పనులన్నీ ఈ వారంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.  ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పరీక్షలో విజయం సాధించవచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగం  మారాలి అనుకుంటే తొందరపడొద్దు. పాత రుణాలు కారణంగా కొన్ని సమస్యలు ఉంటాయి. పని ఒత్తిడి మీ మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య దృష్ట్యా బుధ, గురువారాలు శ్రేయస్కరం కాదు.  ఈవారం ఆంజనేయుడిని పూజించి నేతితో దీపం వెలిగించండి.


కన్యా రాశి వారఫలం
వారం ప్రారంభంలో మీకు శుభవార్తలు అందుతాయి. రాజకీయ వ్యక్తులతో మీ పరిచయాలు బలపడతాయి.  ప్రేమ సంబంధాలలో సంతోషం ఉంటుంది. కుటుంబ జీవితం బావుంటుంది. కళా రంగానికి సంబంధించిన వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. ఎగుమతి-దిగుమతి వ్యాపారులు లాభాలను పొందుతారు.  వ్యాపారంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. మీరు మీ సామర్థ్యానికి మించి పని చేయకూడదు..ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.వివాదాల్లో చిక్కుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. శుక్ర, శనివారాల్లో ధన నష్టం కలగవచ్చు. పూజా మందిరంలో పసుపు ముద్ద ఉంచి పూజించండి


Also Read: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!


తులారాశి వారఫలం
ఈ వారం మీరు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనుకోకుండా డబ్బు చేతికందడంతో మీరు ఉత్సాహంగా ఉంటారు.  వ్యాపారంలో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఆఫీసులో మీ పనితీరు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల నిరాసక్తత ఉండకూడదు. భాగస్వామ్య పనులలో సహోద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కుకున్నప్పటికీ విచక్షణతో వ్యవహరించాలి.  విద్యార్థులు కష్టపడాల్సిందే. దేవీ కవచం పఠించండి. 


వృశ్చిక రాశి వారఫలం
ఈ వారం మీరు  పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు  అద్భుతంగా ఉంటుంది.    వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడం ద్వారా  ఉత్సాహంగా ఉంటారు.   కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయంలో గందరగోళానికి గురవుతారు. స్నేహితుల ప్రవర్తన కొంతవరకు స్వార్థపూరితంగా ఉండవచ్చు. మీరు ఉద్యోగంలో పనికి సంబంధించి కొన్ని అనిశ్చితులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. రుణం తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. అనవసర ఖర్చులను తగ్గించండి. ఉద్యోగం-వ్యక్తిగత జీవితం మధ్య సామరస్యాన్ని కొనసాగించడం కొంచెం కష్టమవుతుంది. దుర్గామాతను ఆరాధించండి


Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!


ధనుస్సు రాశి వారఫలం
ఈ వారం మీరు శక్తివంతంగా ఉంటారు.  ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ నాయకత్వ సామర్థ్యంతో పెద్ద సమస్యను పరిష్కరిస్తారు. సృజనాత్మక ఆలోచనలపై దృష్టి సారిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో కోరుకున్న బదిలీని పొందవచ్చు. ఆదివారం, సోమవారం ,శనివారాలు మీకు కలిసొస్తాయి. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు  మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు మీ ప్రవర్తనలో సున్నితంగా ఉండాలి. న్యాయపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి.  విద్యార్థులు తమ మనోధైర్యాన్ని కోల్పోకూడదు.  జ్యోతిష్యం  ఇతర ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హనుమాన్ చాలీసా చదవండి.


మకర రాశి వారఫలం
ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి శుభసమయం. పరిశోధనా రంగంలో ఉండేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహా మీకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది. బంధువులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మీరు మీ కృషికి తగిన ఫలితాలను పొందుతారు.  వైవాహిక జీవితంలో వివాదాలు ఉండొచ్చు. ఇంట్లో ఏదో ఒక అంశంపై వాగ్వాదం జరగుతూనే ఉంటుంది. కార్యాలయంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంపై ఒత్తిడి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  వారంలో ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉండదు.  విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.


Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


కుంభ రాశి వారఫలం
ఉద్యోగులు కొత్త ప్రయోగాలు చేయవచ్చు. సహోద్యోగుల సహకారంతో మీరు మీ పనిలో చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఆదాయం  పెరుగుతుంది. మార్కెటింగ్‌కు సంబంధించిన పనిలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. బుధ, శనివారాలు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంటే పత్రాలు జాగ్రత్తగా గమనించాలి. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. పక్షులకు నీరు అందేలా ఏర్పాటు చేయండి. 


మీన రాశి వారఫలం
కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో వచ్చే మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవసరమైన నిర్ణయాలు ఆ క్షణమే తీసుకోగలుగుతారు. గురువారం నుంచి శనివారం వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలుచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండడం మంచిది. వినాయకుడిని పూజించండి. 


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.