Weekly Horoscope 31 July-6 August


మేష రాశి 
ఈ రాశివారు ఆగస్టు మొదటివారం బాగానే ఉంటుంది. ప్రణాళిక ప్రకారం వెళితే అనుకున్న పనులు పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నష్టాల నుంచి కోలుకునేందుకు అడుగుముందుకు వేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. గొప్ప వ్యక్తులను కలుస్తారు. సూర్యుడికి నమస్కరించండి.


వృషభ రాశి
జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకూ ఈ వారం రోజులు వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు అధికం అవుతాయి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఈ వారం పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. వృషభ రాశి విద్యార్థులు ఇబ్బంది పడతారు. "ఓం దుర్గాయ నమః" అనే మంత్రాన్ని ప్రతిరోజూ 21 సార్లు జపించండి. 


మిథున రాశి
నూతన వారంలో మిథునరాశి వారికి మానసిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక  వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు మంచిరోజు. ఈ రాశి నిరుద్యోగులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. మీ తోబుట్టువుల నుంచి సహకారం పొందుతారు "ఓం బుధాయ నమః" అనే మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించండి. 


Also Read: రాముడితో పాటూ సోదరుల దర్శనభాగ్యం దక్కాలంటే ఇక్కడకు వెళ్లాలి!


కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. సన్నిహితుల సూచనలను పరిగణలోకి తీసుకోండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.  గౌరీదేవిని పూజించండి. 


సింహ రాశి
ఈ వారం సింహరాశివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. బుధుడి సంచారం వల్ల విద్యార్థులకు కష్టాలు ఎదురవుతాయి. ఎదుటివారిని అర్థం చేసుకునే సామర్థ్యం ఉండడం వల్ల మీకు సన్నిహితులు పెరుగుతారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. 


కన్యా రాశి
ఆగస్టు మొదటివారం కన్యారాశివారికి మంచిజరుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ వ్యూహం మంచి ఫలితాలనిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాశివారిలో  సృజనాత్మక సామర్థ్యం మెరుగుపడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ సమయం కూడా అనుకూలంగా ఉంటుంది.  "ఓం నమో మహా విష్ణవే నమః" అనే మంత్రాన్ని ప్రతిరోజూ 41 సార్లు జపించండి.


తులా రాశి 
ఈ రాశివారికి ఈవారం మిశ్రమ ఫలితాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్తపడండి. కొన్ని వ్యవహారాల్లో  సహనంగా ఉండాలి సమయస్పూర్తితో వ్యవహించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి. రోజూ గణేష్ చాలీసా పఠించండి


వృశ్చిక రాశి
ఈ వారం వృశ్చిక రాశివారు తొందరగా అలసిపోతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులేకు అనుకూల సమయం. ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు పెద్దల సహాయం తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తద్వారా మీరు పశ్చాత్తా పడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మంగళవారం కేతు గ్రహం కోసం యాగం హవనం చేయండి


Also Read: కుక్క ఏడిస్తే అపశకునమా , ఎవరికో మూడినట్టేనా -ఇందులో నిజమెంత!


ధనుస్సు రాశి
రొటీన్ లైఫ్ తో ఈ రాశివారు విసిగిపోతారు. అందుకే ఈ వారం కాస్త భిన్నంగా ఉండాలని ఆలోచిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వివాహితుల జీవితం బావుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబానికి విలువైన సమయం కేటాయిస్తారు. "ఓం శివ ఓం శివ ఓం" అనే మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించండి. 


మకర రాశి
ఈ వారం మకరరాశివారి ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంటాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు శుభవార్త పొందవచ్చు. మీరు మీ నైపుణ్యాన్ని,అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు పనిచేసే రంగంలో విజయం సాధిస్తారు. ఇష్టదైవాన్ని పూజించండి.


కుంభ రాశి
ఈ వారం  కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు తలపెట్టిన పనులను పూర్తిచేసే పనిలో ఉండండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మీ జీవిత భాగస్వామి నుంచి సహాయం అందుతుంది. కుటుంబంలో సానుకూలత ఉంటుంది.  ఒత్తిడి నుండి బయటపడతారు. ఉద్యోగులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి..ముఖ్యమైన పత్రాలను కోల్పోవడం వల్ల ఇబ్బందులు పడతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. 


మీన రాశి
వారికి ఈ వారం మీనరాశి వారికి ఆరోగ్యం పరంగా సానుకూలత ఉంటుంది. మీరు మీ సమస్యలను పరిష్కరించుకోగలరు. నాలుగు రకాల పనులు ‍ఒకేసారి చేయడం కన్నా ఓ పనిపై శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. శనివారం నాడు పేదలకు దానం చేయండి. 


గమనిక: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.