A Dog Howling Means Death: జంతువులలో అత్యంత విశ్వాసం కలిగినది కుక్క. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా. కానీ కుక్కలు ఏడిస్తే మాత్రం భయపడిపోతుంటారు. అది వీదిలో కుక్క అయినా, ఇంట్లో కుక్క అయినా భయపడటం మాత్రం ఖాయం. దీనికి ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అవీలేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఇదంతా అపోహమాత్రమే అని చెప్పేందుకు చాలామంది చాలా పరిశోధనలు చేశారు. కానీ వాటి ఫలితం అంతంతమాత్రంగానే మిగిలింది. ఈ నమ్మకాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బలపరిస్తే కొందరు హేతువాదులు మాత్రం ఇదంతా అపోహమాత్రమే అని కొట్టపడేస్తున్నారు.వాస్తవానికి ఈ నమ్మకం మన దేశంలో పుట్టినది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది.  


Also Read: జూలై 27 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారు ఖర్చులు తగ్గించాలి


గ్రీకుల నుంచి వచ్చిన నమ్మకం ఇది


కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, మరణం సంభవించే అవకాశాలున్నాయని అనుకోవడం కూడా వారినుంచే మొదలైందంటారు. అలా అలా ఇతర దేశాలకు కూడా ఆ విశ్వాసం పాకింది. ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు ఓ అమెరికా రచయిత. కుక్క శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూశాకే అలా చేస్తుందని నమ్ముతారు. ఇవన్నీ మూఢనమ్మకాలని కొందరు కొట్టిపడేసినా చాలామంది విశ్వశిచించారు. 


మరణ వాసన కుక్కలకు తెలుస్తుందా!


కుక్కలు దెయ్యాన్ని చూడగలగడం, మరణాన్ని పసిగట్టడం అన్ని మూఢవిశ్వాసాలు అని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటిని విశ్వసించ వలసిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ అందుకు వివరణ ఇస్తున్నారు పండితులు. కుక్కలు మనిషిని వాసన ఆధారంగా పసిగడతాయి. అలాగే ఓ వ్యక్తి చావుకి దగ్గరైనప్పుడు ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను ముందుగా గుర్తించేస్తాయట. వాసన ద్వారా మరణాన్ని పసిగట్టగానే అలా ఏడుస్తాయంటారు. కొన్నిసార్లు అనారోగ్యం, ఆకలి కారణంగా ఏడుస్తాయని చెప్పేవారున్నారు. కానీ కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తాయి. అంటే వాటికి ఆత్మలు కనిపించాయని అర్థం అంటారు పండితులు. 


Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!


సైంటిఫిక్ గా నిరూపణ కాలేదు


కుక్క అరిస్తే మరణం సంభవిస్తుంది అన్నది అపోహ మాత్రమే అని కొట్టిపడేయానికి కారణం ఏంటంటే సైంటిఫిక్ గా నిరూపణ కాలేదు.కానీ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాత్రం కుక్కల ఏడుపుని అపశకునం, అశుభం అని చెబుతారు. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial