Venus Transit in Pisces 2025: 2025లో చాలా గ్రహాలు రాశులు మారుతున్నాయ్. వాటిలో ముఖ్యమైనది శని కాగా..మరో ముఖ్యమైన గ్రహం శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట కాలం తర్వాత తమ రాశులను మార్చుకుని మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల రాశిచక్రంలోని మార్పు ప్రతి రాశివారి జీవితంపైనా ప్రభావం చూపిస్తుంది. 


2025 లో, శని, బృహస్పతి మరియు రాహు-కేతువు వంటి ప్రభావవంతమైన గ్రహాలు తమున్న రాశి నుంచి పరివర్తనం చెందుతున్నాయి.సంపద, ఆనందం మరియు శ్రేయస్సుకి సంబంధించిన గ్రహం అయిన శుక్రుడు  2025 సంవత్సరం ప్రారంభంలో మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది..కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. 2025 ఆరంభంలో ఏ రాశులవారికి యోగకాలమో ఇక్కడ తెలుసుకోండి.


Also Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!


2025 జనవరి 28న మీన రాశిలో ప్రవేశించే శుక్రుడు మార్చి 2 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు...ఈ సమయంలో ఈ రాశులవారికి అన్నింటా యోగకాలమే...
 
వృషభ రాశి (Taurus)


2025 సంవత్సరం ప్రారంభంలో శుక్రుని సంచారం వృషభ రాశి వారికి చాలా అదృష్టాన్నిస్తుంది. 2025వ సంవత్సరంలో శుక్రుడు  లాభ గృహంలో సంచరించడంతో వృషభ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. ఉద్యోగస్తులకు సంవత్సరం ప్రారంభంలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మారుతుంది. భూమి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. గౌరవం పెరుగుతుంది. మీరు శుభవార్త పొందుతారు.


Also Read: అదృష్టం - దురదృష్టం.. 2025లో తులా రాశి వారు ఏవైపు తూగుతున్నారు!


కుంభ రాశి (Aquarius)


మీన రాశిలో శుక్రుడి సంచారం కుంభ రాశివారికి కలిసొస్తుంది. మీ రాశి నుంచి రెండో స్థానంలో శుక్రుడి సంచారం ఆర్థికంగా మిమ్మల్ని ఓ మెట్టు ఎక్కిస్తాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది..చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. ఎంతటివారిని అయినా మీ మాటలతో కట్టిపడేస్తారు. ఉద్యోగులు నూతన ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆనందంగా ఉంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఏడాది ఆరంభంలో ఆర్థికంగా పెరుగుదల మీకు కనిపిస్తుంది. 


మీన రాశి (Pisces)


మీ రాశిలోనే శుక్రుడి సంచారం ఉండబోతోంది. ఈ రాశి లగ్న గృహంలో సంచరించడం వల్ల వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి..మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి. రాజకీయాల్లో ఉండేవారికి గౌరవం పెరుగుతుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!