Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ గదిలో సహస్ర వెతికి లక్ష్మీ బ్యాగ్‌కి ఉన్న ఇండిగో విమానం ట్యాగ్ చూస్తుంది. అంబికతో చెప్పి లక్ష్మీకి విమానంలో ప్రయాణించే అంత సీన్ ఉందా ఓ కన్నేసి లక్ష్మీని గమనించాలని అనుకుంటారు. ఇక ఓ వ్యక్తి వచ్చి విహారి, సహస్రల పెళ్లి కార్డులు తీసుకొని వచ్చి ఇస్తాడు. అందరూ చాలా సంతోషంగా కార్డులు చూస్తారు. వసుధ యమునకు చూడటానికి అందిస్తే యమున సంతోషంగా తీసుకోబోతే పద్మాక్షి, సహస్ర అందరూ యమునను కోపంగా చూస్తారు.
యమున: వద్దులే వసుధ మీరంతా చూశారు కదా.
వసుధ: భలే దానివే వదిన నువ్వు చూడకపోతే ఎలా. ఇది నీ కొడుకు పెళ్లి నీ కొడుకు పెళ్లిలో శుభలేఖల నుంచి పెళ్లికి వచ్చే చుట్టాలను పంపే వరకు ప్రతి విషయంలోనూ నువ్వు ఉండాలి. నువ్వు లేకుండా పెళ్లి జరగదు జరగకూడదు. నువ్వు లేకుండా పెళ్లి జరగాలి అని ఎవరైనా అనుకున్నా అది జరగదు.
యమున: పర్వాలేదు వసుధ శుభలేఖలు అంటే శుభకార్యానికి ఆరంభాలు అలాంటి వాటిని నేను ముట్టుకోవడం మంచిది కాదు.
విహారి: అమ్మ నువ్వు దీవిస్తేనే నా పెళ్లి జరుగుతుంది. నీ ఆశీస్సులు తోనే నాకు కొత్త జీవితం మొదలవుతుంది. అలాంటిది నువ్వు శుభలేఖలు చూడకపోతే ఎలా. ఎవరు ఏమనుకున్నా పర్లేదు నాకు జన్మనిచ్చిన దానివి నువ్వు నా జీవితంలో ఏం చేసినా నాకు శుభమే అలాంటిది నువ్వు శుభలేఖలు ముట్టుకుంటే తప్పేంటి ఇదిగో తీసుకోచూడు. అమ్మ ఇదిగో కార్డు.
వసుధ: ఆ కళ్లల్లో కన్నీలు ఏంటి వదిన.
యమున: కొడుకు పెళ్లి జరుగుతుంది అని చెప్పడానికి ఈ శుభలేఖలే నిదర్శనం కదా. సహస్ర, విహారిల పేర్లు ఈ శుభలేఖలో చూస్తుంటే ఎందుకో సంతోషంతో ఆనంద భాష్పాలు అలా వచ్చేశాయి.
పండు: మనసులో నీ భర్త పెళ్లి గురించి వాళ్లు సంతోషపడుతుంటే వాళ్లని చూసి నువ్వు సంతోషపడుతున్నావ్ చూడు నీది చాలా గొప్ప మనసు లక్ష్మీమ్మ.
అంబిక: ఈవిడ ఈవిడ ఓవరాక్షన్ ప్రపంచంలో ఎవరూ ఎవరి పిల్లలకు పెళ్లి చేయనట్లు ఈవిడ మాత్రమే చేస్తున్నట్లు బిల్డప్.
సహస్ర: నాకు అలాగే ఉంది పిన్ని కానీ బావ దగ్గర ఏం అనకూడదు అని సైలెంట్‌గా ఉన్నాను.
పద్మాక్షి: సరే సరే శుభలేఖని గుడికి తీసుకెళ్లి దేవుడి పాదాల దగ్గర పెడితే ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. సహస్ర, విహారిలు రెడీగా ఉండండి.
ఉదయం అందరూ గుడికి వస్తారు. విహారి ఇంకా రాలేదని పద్మాక్షి సహస్రని అడుగుతుంది. చాలా సార్లు కాల్ చేశా లిఫ్ట్ చేయడం లేదని చెప్తుంది. మర్చిపోయాడో కావాలని రాలేదో అని అంబిక అంటుంది. నీకు చెప్పాడా అని వసుధ యమునను అంటే చెప్పలేదు కానీ ప్రతి విషయం చెప్తాడు కానీ ఏమైందో అంటుంది. ఇక పద్మాక్షి విహారికి నిజంగానే ముఖ్యమైన పని ఉందా లేక ఈ పెళ్లి ఇష్టం లేదా కనీసం తల్లికి కూడా చెప్పకుండా వెళ్లలేదని తిడుతుంది. ఏ మగాడికైనా మొదటి ఇంపార్టెంట్ భార్య అవ్వాలని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక మరోవైపు కనకం పసుపు బట్టలు కట్టుకొని తల మీద నీరు పోసుకుంటుంది. అది చూసిన విహారి పాపం కనక మహాలక్ష్మీ నా కోసం ఇలా చేస్తుందని అనుకుంటాడు. ఇంతలో విహారికి సహస్ర కాల్ చేస్తుంది. విహారి కాల్ లిఫ్ట్ చేయడు. పద్మాక్షి ఛీ అనుకొని లోపలికి వెళ్లిపోతుంది. విహారి కనకంతో ఇవన్నీ అవసరమా అంటే మీ జీవితం బాగుండాలి అన్నా మీ జీవితంలో ఉన్న గండాలు పోవాలి అన్నా ఇది తప్పదని అంటుంది.
ఇక పసుపు కుంకుమ పట్టుకొని గుడి మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మోకాల మీద మెట్లు ఎక్కుతుంది. విహారి చూసి ఏం చేస్తాన్నావ్ అంటే దానికి కనకం పంతులు గారి మోకాల మీద మెట్లు ఎక్కి ఇలా చేయాలని చెప్తుంది. విహారి వద్దని అంటాడు. తప్పదు అని ఇష్టంతో చేస్తున్నాను అని ఆపొద్దని కనకం అంటుంది. కనకం పసుపు బొట్లు పెడుతూ మెట్లు ఎక్కుతుంటే విహారి పక్కనే నడుస్తాడు. కనకం చాలా మెట్లు ఎక్కడంతో కళ్లు తిరుగుతుంది. అయినా పూర్తి చేస్తుంది. కనకం లేవలేకపోతే విహారి పట్టుకొని లేపుతాడు. మీకు ఇక ఎప్పటికీ ఏం కాదు అనే సంతృప్తి నాకు చాలు అని కనకం అంటుంది. ఇక కనకం, విహారిలు దేవుడిని దర్శించుకుంటారు. ఇక పంతులు పూజ చేసి లక్ష్మీ, విహారిలకు కలిపి దండ వేస్తాడు. ఇద్దరూ షాక ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి ఇలా అని విహారి అడిగితే దానికి పంతులు కుంకుమార్చన పూజ పూర్తి చేసిన తర్వాత ఇద్దరూ ఒకే దండ వేసుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఆ గదిలో నయని దేహం - అమ్మవారి సాక్షిగా పెద్ద రిస్క్, ఒక శరీరాన్ని అలా మరొకటి ఇలా!