Ugadi panchangam 2024 to 2025 Education Astrology: కొన్నిసార్లు విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా మంచి ఫలితాలు సాధించలేరు..కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అందుకే గ్రహబలం కూడా తోడవ్వాలి అంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ఏప్రిల్ 9 నుంచి మొదలయ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశుల విద్యార్థులు చదువులో రాణిస్తారో ఇక్కడ తెలుసుకోండి...


మేష రాశి విద్యార్థులు


మేష రాశి విద్యార్థులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో గురుబలం బావుంది. ఇతర విషయాలపై కన్నా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఇంజినీరింగ్ , మెడికల్, లా సెట్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షు రాసేవారు మంచి ర్యాంకులు సాధిస్తారు. అనుకున్న కాలేజీలో సీట్ పొందుతారు. 


వృషభ రాశి విద్యార్థులు


ఈ ఉగాది నుంచి వృషభ రాశి విద్యార్థులకు బ్యాడ్ టైమ్ మొదలవుతోంది. చదవుపై శ్రద్ధ తగ్గుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించలేరు. చెడు సహవాసాల వల్ల చాలా నష్టపోతారు. పై చదువుల కోసం రాసే ప్రవేశ పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధించలేరు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కోర్కె నెరవేరుతుంది. 


Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశుల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మామూలుగా లేదు - మిగిలిన వ్యాపారుల పరిస్థితేంటి!


మిథున రాశి విద్యార్థులు


మిథున రాశి విద్యార్థులకు ఈ ఏడాది చదువుపై శ్రద్ద తక్కువే ఉంటుంది. చాలా కష్టపడితేనే కనీస ఫలితాలు సాధించగలరు. విదేశాల్లో చదవాలి అనుకున్న వారి కోర్కె నెరవేరుతుంది. ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. 


కర్కాటక రాశి విద్యార్థులు


ఈ రాశి విద్యార్థులకు గురుబలం బావుంది...జ్ఞాపకశక్తి పెరుగుతుంది..పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్యకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మెడికల్, ఇంజినీరింగ్, లాసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. కోరుకున్న కాలేజీలో సీటు సాధిస్తారు. 


సింహ రాశి విద్యార్థులకు


సింహ రాశి విద్యార్థులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం బాగానే ఉంది. చదువుపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది...జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. అయితే చెడు స్నేహాలు తగ్గించుకోకుంటే చాలా నష్టోపోతారు. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చినా కావాలి అనుకున్న కళాశాలలో సీటు దక్కించుకోవడం కష్టమే. 


Also Read: ఉగాది తర్వాత ఈ రాశుల ఉద్యోగుల జీవితంలో కొత్త వెలుగులే - ఆ 2 రాశులవారికి మినహా!


కన్యా రాశి విద్యార్థులు


కన్యా రాశి విద్యార్థులుకు గురుబలం కలిసొస్తుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఎంట్రన్స్ టెస్టులు రాసేవారు మంచి ర్యాంకులు పొందినా ఆశించిన కళాశాలలో సీట్ పొందలేరు. 


తులా రాశి విద్యార్థులు


తులా రాశి విద్యార్థులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అస్సలు గురుబలం లేదు. అందుకే చదివింది గుర్తుండదు, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పరీక్షలలో ఏదో అలా ఉత్తీర్ణులవుతారు అంతే. పైగా చదువుపై కన్నా ఇతర విషయాలపై చాలా ఆసక్తి పెరుగుతుంది. ఫలితంగా ఎంట్రన్స్ పరీక్షలలో ర్యాంకులు సాధించలేరు...మంచి కళాశాలలో సీట్ పొందలేరు. 


వృశ్చిక రాశి విద్యార్థులు


వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ ఉగాది నుంచి మంచి టైమ్ స్టార్ట్ అవుతోంది. గురుబలం ఉండడం వల్ల మీరో ప్రతిభను సరిగ్గా ప్రదర్శించగలుగుతారు. పోటీ పరీక్షలు రాసినవారు మంచి ఫలితాలు పొందుతారు. మెడికల్, ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకులు, ఆశించిన కాలేజీలో సీట్ సాధించగలరు. విదేశాలకు వెళ్లాలి అనుకున్నవారికి ఇది గుడ్ టైమ్. 


ధనస్సు రాశి విద్యార్థులు


ఈ రాశి  విద్యార్థులకు గురుబలం బావుండడం వల్ల పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలుకు వెళ్లాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు...ఆశించిన కాలేజీల్లో సీటు పొందుతారు. 


Also Read: 60 ఏళ్లకి బ్యాక్ టు చైల్డ్ హుడ్ - తెలుగు సంవత్సరాల నంబర్ వెనుక ఆంతర్యం ఇదా!


మకర రాశి విద్యార్థులు


ఈ రాశి విద్యార్థులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆగష్టు తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈ లోగా రాసే పోటీ పరీక్షలలో మంచి మార్కులు, ర్యాంకులు సాధించలేరు. మొదటి ఆరు నెలలు పడిన ఇబ్బందుల నుంచి తర్వాత ఆరు నెలలు పూర్తిస్థాయిలో ఉపశమనం ఇస్తాయి. 


కుంభ రాశి విద్యార్థులు


కుంభ రాశి విద్యార్థులకు ఈ ఉగాది నుంచి బావుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. తమకు నచ్చిన కళాశాలలో చదువుకోగలగుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకున్నా ఇదే శుభసమయం.


Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!


మీన రాశి విద్యార్థులు


మీన రాశి విద్యార్థులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో గురుబలం బావుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇతర వ్యవహారాలపై శ్రద్ధ తగ్గించి మళ్లీ చదువు ధ్యాసలో పడతారు. 


Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.