Ugadi panchangam in telugu 2024 to 2025 


మేష రాశి వ్యాపారులకు


క్రోధి నామ సంవత్సరం మేష రాశి వ్యాపారులకు అత్యంత అనకూలం. ఏ వ్యాపారంలో ఉన్నవారికి అయినా మంచి లాభాలొస్తాయి. నిర్మాణ రంగంలో ఉండేవారి ఆదాయం భారీగా పెరుగుతుంది. చిరు వ్యాపారులు, హోటల్స్ నడిపేవారికి, ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి అన్నీ శుభఫలితాలే.  బంగారం, వెండి వ్యాపారులు లాభపడతారు. 


వృషభ రాశి వ్యాపారులకు


వృషభ రాశి వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభసమయం. ఆశించిన దానికన్నా ఎక్కుల లాభాలు పొందుతారు. 


మిథున రాశి వ్యాపారులకు 


మిథున రాశికి చెందిన అన్ని రకాల వ్యాపారులకు యోగ కాలమే. ఏ వ్యాపారం ప్రారంభించినా లాభపడతారు. హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు వస్తాయి. 


Also Read: ఉగాది తర్వాత ఈ రాశుల ఉద్యోగుల జీవితంలో కొత్త వెలుగులే - ఆ 2 రాశులవారికి మినహా!


కర్కాటక రాశి వ్యాపారులకు


ఈ రాశి వ్యాపారులకు నూతన ఏడాదిలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఏ రంగంలో ఉన్నవారైనా ఊహించని లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారులకు కూడా బాగానే కలిసొస్తుంది. 


సింహ రాశి వ్యాపారులకు


సింహ రాశి వ్యాపారులకు క్రోధి నామ సంవత్సరంలో టైమ్ బాలేదు. ఎంత కష్టపడినా ఆశించిన లాభాలు పొందలేరు. నిర్మాణ రంగంలో ఉండేవారు లాభపడతారు కానీ ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. కాంట్రాక్ట్ వ్యాపారులు అనుకూల సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 


కన్యా రాశి వ్యాపారులకు


ఈ రాశి వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు కానీ అంతగా నష్టాల్లో కూరుకుపోరు. చిన్న చిన్న వ్యాపారులకు పర్వాలేదు. ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి నష్టం తప్పదు. నగల వ్యాపారులకు అంత మంచి లాభాలు రావు. కాంట్రాక్ట్ , రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. 


Also Read: 60 ఏళ్లకి బ్యాక్ టు చైల్డ్ హుడ్ - తెలుగు సంవత్సరాల నంబర్ వెనుక ఆంతర్యం ఇదా!


తులా రాశి వ్యాపారులకు


శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ రాశికి చెందిన అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగానే ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. జాయింట్ వ్యాపారం చేసేవారు గతంలో కన్నా మంచి లాభాలు పొందుతారు. కాంట్రాక్టు , రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసొస్తుంది


వృశ్చిక రాశి వ్యాపారులకు


కొత్త ఏడాదిలో వృశ్చిక రాశివారికి మామూలుగా ఉందంతే. భారీగా లాభాలు వచ్చే ఛాన్స్ లేదు...అలాఅని నష్టపోరు. అలా నడుస్తుంది వ్యాపారం. ఫైనాన్స్ వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు మాత్రం అస్సలు నష్టపోరు. హోల్ సేల్ , రీటైల్ రంగంలో ఉన్నవారు సాధారణ లాభాలు పొందుతారు. 


ధనస్సు రాశి వ్యాపారులకు


ధనస్సు రాశి వ్యాపారులకు క్రోధి నామ సంవత్సరం కలిసొస్తుంది. ఏ వ్యాపారంలో ఉన్నవారైనా లాభపడతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొందరు వ్యాపారులకు ఏడాది ఆరంభంలో నష్టాలు వచ్చినా మళ్లీ వాటినుంచి బయటపడగలగుతారు. ఇనుము, స్టీలు వ్యాపారులకు కష్టకాలమే. 


Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!


మకర రాశి వ్యాపారులకు


మకర రాశి వ్యాపారులకు శ్రీ క్రోధి నామసంవత్సరం కలిసొస్తుంది. శని అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడతారు. కాంట్రాక్టు పనులు చేస్తున్నవారికి కలిసొస్తుంది. బంగారం వ్యాపారులకు మొదటి ఆరు నెలలు కన్నా ఆ తర్వాత బావుంటుంది. 


కుంభ రాశి వ్యాపారులకు


కుంభ రాశి వ్యాపారులకు ఈ ఉగాది నుంచి మొదటి ఆరునెలలు అద్భుతంగా ఉన్నా..ఆ తర్వాత ఆరు నెలలు అనుకోని సమస్యలు వెంటాడుతాయి. ట్రాన్స్ పోర్ట్ రంగంలో ఉండేవారు, బంగారం, వెండి వ్యాపారుల నష్టపోతారు. కాంట్రాక్టులు చేసేవారికి సాధారణ ఫలితాలున్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం లాభపడతారు. 


మీన రాశి వ్యాపారులకు


ఈ ఉగాది నుంచి మీన రాశి వ్యాపారులకు అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. శని, గురుడు అనుకూల ఫలితాలను ఇవ్వడం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టే ఉంటుంది. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా సక్సెస్ మీ సొంతం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు భారీగా లాభాలు ఆర్జిస్తారు. గతంలో మీరు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి సంపాదించేస్తారు. 


Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.