Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Aquarius Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం  కుంభ రాశి వార్షిక ఫలితాలు


కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1


కుంభరాశివారికి ఏల్నాటి శని కొనసాగుతోంది. శుభాల నిచ్చే గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. రాహువు శుభ స్థానంలో ఉండగా..కేతువు మాత్రం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఫలితంగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సెప్టెంబరు నెల వరకూ అన్ని విధాలా కలిసొస్తుంది..ఎంతటి కష్టమైన పనిని అయినా పూర్తిచేస్తారు,ఆదాయం బాగానే ఉంటుంది. సెప్టెంబరు నుంచి చికాకులు మొదలవుతాయి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడినా వివాదాలు, ఏ పని ప్రారంభించినా పూర్తైనట్టే అనిపిస్తుంది కానీ చివరి నిముషంలో ఫలితం తారుమారవుతుంది, ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరు. కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. 


Also Read: ఈ రాశివారికి శని ప్రభావం తగ్గి గురుబలం పెరుగుతుంది - మీపై ఈర్ష్య, అసూయ ఎక్కువే - శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశిఫలాలు!


కుంభ రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆగష్టు వరకూ అధ్భుతంగా ఉంటుంది. ప్రమోషన్ పొందుతారు, ఉన్నతాధికారుల అనుగ్రహం మీపై ఉంటుంది. సెప్టెంబరు నుంచి పరిస్థితులు తారుమారవుతాయి. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తారు. సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైమ్ బాలేదు. నిరుద్యోకులకు ఆగష్టు లోగా ఉద్యోగం వస్తే రావాలి లేదంటే ఈ ఏడాది అంతే సంగతులు. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పర్మిమెంట్ అయితే ఆగస్టులోగానే...లేదంటే ఆ తర్వాత జరగని పనే.


కుంభ రాశి వ్యాపారులకు


ఈ రాశి వ్యాపారులకు ఆగష్టు వరకూ అన్ని రంగాల్లో ఉండేవారు లాభాలు అందుకుంటారు. ఆ తర్వాత నుంచి అనుకోని సమస్యలు, ఆర్థిక నష్టాలు తప్పవు. ట్రాన్స్ పోర్టు రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు. వెండి బంగారం వ్యాపారులు విపతీరంగా నష్టపోతారు. కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలున్నాయి. రియల్ ఎస్టేర్ రంగం వారు మాత్రం లాభపడతారు


Also Read: ఈ రాశివారు బాగా సంపాదిస్తారు నిముషాల్లో ఖర్చుచేసేస్తారు - నరఘోష చాలా ఎక్కువ - శ్రీ క్రోధి నామ సంవత్సరం రాశిఫలాలు!


కుంభ రాశి విద్యార్థులకు


కుంభ రాశి విద్యార్థులకు ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. ఇంజినీరింగ్, మెడికల్ సహా ఇతర  ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు. విదేశాలలో చదువుకోవాలి అనుకున్నవారి ఆశ ఫలిస్తుంది.


కుంభ రాశి కళాకారులకు


ఈ రాశి కళాకారులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి. అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది. ఓర్పు, నేర్పుగా ఉంటేనే నెగ్గుకురాగలరు.


కుంభ రాశి వ్యవసాయదారులకు


ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లభాలనిస్తుంది..రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అప్పులు తీర్చగలుగుతారు. 


కుంభ రాశి రాజకీయనాయకులకు


మిగిలిన అన్ని రంగాల వారికి ఆగష్టు వరకూ అనుకూల సమయం అయితే...ఈ రాశి రాజకీయ నాయకులకు మాత్రం ఆగష్టు వరకూ టైమ్ అస్సలు బాలేదు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఎన్నికలు ఈ లోగానే జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో గెపులు సాధ్యం అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ. భారీగా ఖర్చు చేసినా కానీ మంచి ఫలితం పొందలేరు. మీకు రావావ్సిన నామినేటెడ్ పదవులు కూడా వేరొకరికి వెళ్లిపోతాయి. ఆస్థులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆగష్టు తర్వాత నుంచి పరిస్థితి చక్కబడుతుంది.


ఓవరాల్ గా చూసుకుంటే కుంభ రాశివారికి ఆగష్టు వరకూ పరిస్థితులు అనుకూలం..ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి.మీ మనోబలం, మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది...


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.