Ugadi Rasi Phalalu In Telugu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర ధనస్సు రాశి ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025

Ugadi Panchangam 2024 -2025: ఏప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏడాది ధనస్సు రాశివారి ఆదాయ వ్యయాలు , వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...

Continues below advertisement

Ugadi Panchangam  Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Sagittarius Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం  ధనస్సు రాశి వార్షిక ఫలితాలు

Continues below advertisement

ధనస్సు రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 7 అవమానం : 5

ధనస్సు రాశివారికి గతేడాది కన్నా శ్రీ క్రోధి నామ సంవత్సరం మంచి ఫలితాలనే ఇస్తుంది. సంతోషాన్నిచ్చే గురుడు ఆరో స్థానంలో, రాహుకేతువులు 4,10 స్థానాల్లో ఉండడం వల్ల , శని కూడా శుభ స్థానంలోనే ఉన్నందున మీరున్న రంగంలో రాణిస్తారు. మీ ప్రతిభకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబంలో, బంధువులలో ఆదరణ పెరుగుతుంది కానీ మీకు నరఘోష చాలా ఎక్కువ. సొంత విషయాల్లో కన్నా ఇతరుల విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అనుకోని ఖర్చులు అధికంగా చేయాల్సి వస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు తప్పవు.  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. ఊహించని సమస్యల్లో చిక్కుకుంటారు కానీ గురుబలం వల్ల ఆఖరి నిముషంలో బయటపడతారు..ఈ లోగా ఆందోళన తప్పదు.  కుటుంబానికి సంబంధించిన ప్రతివిషయంలోనూ ఆలోచించి మసలుకోవాల్సి ఉంటుంది...

Also Read: ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా ఈ ఉగాది నుంచి తిరుగులేదంతే - శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు!

ధనస్సు రాశి ఉద్యోగులకు

శ్రీ క్రోధి నామ సంవత్సరం ధనస్సు రాశి ఉద్యోగులకు బావుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చు కూడా అంతకుమించి అన్నట్టుంటుంది . ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు...కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.

ధనస్సు రాశి వ్యాపారులకు

ధనస్సు రాశి వ్యాపారులకు ఈ ఏడాది అనుకూల ఫలితాలే ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారులు లాభపడతారు. షేర్ మార్కెట్ వల్ల మిశ్రమ ఫలితాలే పొందుతారు. కొందరు వ్యాపారులకు ఏడాది ఆరంభంలో నష్టాలు వచ్చినా మళ్లీ పుంజుకుంటారు. ఇనుము, స్టీలు వ్యాపారం చేసేవారికి అనుకూలత తక్కువ. 

Also Read:  శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!

ధనస్సు రాశి కళాకారులు

ఈ రాశి కళాకారులకు ఈ ఏడాది కొంతవరకూ అనుకూల ఫలితాలే ఉన్నాయి . ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేకపోయినా అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులుండవు కానీ ఖర్చులు పెరుగుతాయి

ధనస్సు రాశి విద్యార్థులకు

ఈ రాశి విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొందుతారు...కోరుకున్న కాలేజీల్లో సీటు పొందుతారు. క్రీడాకారులకు కూడా అనుకూల సమయమే.

ధనస్సు రాశి వ్యవసాయదారులకు

ఈ రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభాలు తెచ్చిపెడతాయి. కౌలుదారులు కూడా అప్పులు తీర్చగలుగుతారు. ఆదాయం బావుంటుంది

Also Read: ఉగాది నుంచి ఈ రాశివారికి చుక్కలే - మనోధైర్యమే మిమ్మల్ని నడిపించాలి - శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు!

ధనస్సు రాశి రాజకీయనాయకులకు

ధనస్సు రాశి రాజకీయనాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం కలిసొస్తుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీ ఫాలోయింగ్ పెరుగుతుంది. మీరు ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒక పదవి  లభిస్తుంది. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 

ఓవరాల్ గా చూసుకుంటే ధనస్సు రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మంచ ఫలితాలనే ఇస్తోంది. ఎన్ని సమస్యలున్నా గురుబలంతో నెట్టుకొచ్చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి...

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Continues below advertisement