Ugadi Panchangam Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Libra Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం తులా రాశి వార్షిక ఫలితాలు
తులా రాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం:1 అవమానం : 5
తులా రాశివారికి ఈ ఏడాది శుభ ఫలితాలున్నాయి. ఈ రాశివారికి దైవబలం కలిసొస్తుంది. ఎనిమిదో స్థానంలో గురుసంచారం మీకు సంతోషం, ఐశ్వర్యం, ఆనందాన్నిస్తుంది. ఏకార్యం తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రాహు, కేతువులు కూడా శుభ స్థానంలో ఉండడం వల్ల గతేడాది కన్నా మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆదాయం బావుంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, అవమానాలు, అపనిందలు వచ్చినప్పటికీ మీ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అయితే అష్టమంలో గురుడు సంచారం వల్ల కుటుంబ పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది.
తులా రాశి ఉద్యోగులకు
తులా రాశి ఉద్యోగులుక శ్రీ క్రోధి నామ సంవత్సరం యోగకాలం. గ్రహసంచారం బావుండడం వల్ల ప్రమోషన్ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో చిక్కుకున్నవారికి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి
తులా రాశి వ్యాపారులకు
శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ రాశికి చెందిన అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగానే ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. జాయింట్ వ్యాపారం చేసేవారు గతంలో కన్నా మంచి లాభాలు పొందుతారు. కాంట్రాక్టు , రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసొస్తుంది
తులా రాశి వ్యవసాయదారులకు
ఈ రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు లాభిస్తాయి. పంట దిగుబడి బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కౌలు రైతులు లాభపడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.
Also Read: ధనవ్యయం, అపనిందలు, నమ్మకద్రోహం - ఈ రాశివారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చాలా అప్రమత్తంగా ఉండాలి!
తులా రాశి కళాకారులకు
ఈ రాశి కళాకారులకు గురుబలం లేనందున మిశ్రమ ఫలితాలున్నాయి. టీవీ, సినిమా రంగాల్లో ఉండేవారికి నూతన అవకాశాలు వస్తాయి. అద్భుతమైన సంపాదన లేకుండా ఏ లోటూ లేకుండా గడిచిపోతుంది.
తులా రాశి విద్యార్థులకు
తులా రాశి విద్యార్థులకు గురుబలం లేనందున జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పరీక్షలలో బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఈ రాశి విద్యార్థులకు చదువుపై తప్ప ఇతర వ్యవహారాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఇంజినీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొందలేరు..కావాల్సిన కళాశాలలో సీట్లు సాధించలేరు. ఈ రాశి క్రీడాకారులకు బాగానే ఉంది...
తులా రాశి రాజకీయనాయకులకు
తులా రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం అద్భుతంగా ఉంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధిష్టానానికి మీపై మంచి అభిప్రాయం ఉంటుంది. ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా మంచి పదవి పొదుతారు. శత్రువులకు మీ తెలివితేటలతో చెక్ పెడతారు.
ఓవరాల్ గా చెప్పుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం తులా రాశి వారికి మంచి సమయం. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు సాధిస్తారు. అష్టమంలో గురుడి వల్ల చిన్న చిన్న ఇబ్బందులున్నా ఓవరాల్ గా అంతా బాగానే ఉంది...
Also Read: ఈ రాశివారికి గతేడాది కన్నా ఈ సంవత్సరం విశేషమైన యోగ కాలం - క్రోథి నామ సంవత్సరం పంచాగం 2024 to 2025
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.