Gurukula Sainil School Results: కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం మార్చి 10న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ మార్చి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పలితాలను అందుబాటులో ఉంచింది. 6వ తరగతి పరీక్షలో 800 మంది, ఇంటర్ పరీక్షలో 460 మంది అర్హత సాధించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు తర్వాతి దశలో శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. 6వ తరగతి విద్యార్థులకు మార్చి 22 నుంచి 28 వరకు, 11వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 1 నుంచి 6 వరకు ఫిజికల్, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

  


List of Shortlisted Candidates for Class - VI - TSWR SAINIK SCHOOLS 


List of Shortlisted Candidates for Class - XI - TSWR SAINIK SCHOOLS 


తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన లేదా ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్న బాలురు దరఖాస్తు చేసుకున్నారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా మార్చి 1 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు మార్చి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను మార్చి 10న విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేపట్టనున్నారు.


తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఫిబ్రవరి 20న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. 5వ తరగతి ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసుకున్నారు. సరైన అర్హతలు గల బాలురు మార్చి 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థులకు మార్చి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఎంపికైనవారికి తర్వాతి దశలో శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించి నిర్వహించి తుది ఎంపికలు చేపట్టనున్నారు.


🔰  ఇంటర్ సీట్లు వివరాలు..


సైనిక పాఠశాల - ఇంటర్(ఎంపీసీ) ప్రవేశాలు


సీట్ల సంఖ్య: 46.


సీట్ల కేటాయింపు: ఎస్సీ- 60, బీసీ (సి)- 02, ఎస్టీ- 05, బీసీ- 10, మైనార్టీ- 02, ఓసీ/ ఈబీసీ- 01 సీట్లు కేటాయించారు.


🔰  6వ తరగతి సీట్ల వివరాలు..


సైనిక పాఠశాల ప్రవేశాలు - 6వ తరగతి (సీబీఎస్ఈ)


సీట్ల సంఖ్య: 80 


సీట్ల కేటాయింపు: ఎస్సీ- 60, బీసీ(సి)- 02, ఎస్టీ- 05, బీసీ- 10, మైనార్టీ- 02, ఓసీ/ ఈబీసీ- 01.


అర్హతలు: 2023-24 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000; గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000కు మించకూడదు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


Notification


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...