Janasena MP candidates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ(Janasena party) ఖాతాలో రెండు పార్లమెంటు స్థానాలు పడనున్నా యా? మిత్రపక్షంలో భాగంగా జనసేన తీసుకున్న రెండు స్థానాలను గెలుచుకునే పక్కా వ్యూహంతోనే సాగుతోందా?! అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక్కడ పోటీ చేయనున్న ఇద్దరు నాయకులు కూడా బలమైన వారే కావడం.. ఆర్థికంగా కూడా మేనేజ్ చేయగల స్థాయిలో ఉండడంతో ఈ మాటే వినిపిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక(General Elections) ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేన పోటీ చేయనున్న మచిలీపట్నం(Machilipatnam), కాకినాడ(Kakinada) పార్లమెంటు స్థానాలపై పక్కా క్లారిటీ వచ్చింది. సామాజిక వర్గాల పరంగా ఈ రెండు నియోజవర్గాలు బలంగా ఉన్నాయి. మచిలీపట్నంలో కాపులు ఎక్కువగా ఉంటే.. కాకినాడ నియోజకవర్గంలో కాపులు, రెడ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గా ల్లోనూ జనసేన బలమైన నాయకులకే అవకాశం ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
సిట్టింగ్ ఎంపీకే చోటు!
మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ(YSRCP) సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashowri) జనసేన తరఫున పోటీ చేయనున్నారు. ఆయనకు వైఎస్సార్ సీపీ సెగ్మెంటును మార్చడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనకే తిరిగి జనసేన మచిలీపట్నం టికెట్ ఎనౌన్స్ చేశారు పవన్ . ఇక, వ్యక్తిగతంగా చూస్తే బాలశౌరికి ఉన్న మంచి ఇమేజ్, కాపుల్లో జనసేనను గెలిపించుకోవాలన్న కసి వంటివి ఈ దఫా కలిసి రానున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వీటికితోడు.. బాలశౌరికి వైఎస్సార్ సీపీ టికెట్ ఇవ్వలేదన్న ఆవేదన, ఆయన పట్ల సానుభూతి కూడా నియోజకవ ర్గంలో ఆయనకు ప్లస్‌గా మారనుందని అంటున్నారు. ఈ పరిణామాలకు తోడు.. బాలశౌరికి గత ఐదేళ్ల కాలంలో మచిలీపట్నంలో చేసిన అభివృద్ది పనులు కూడా ప్లస్ కానున్నాయని అంటున్నారు. కేంద్రం నుంచి ఇక్కడికి నిదులు కూడా తీసుకువచ్చారు. సో.. ఇది బాలశౌరికి ఇవన్నీ కలిసి వస్తాయని జనసేన నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో బాలశౌరిగెలుపు నల్లేరుపై నడకగా మారినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది.
యువ వ్యాపారవేత్తకు కాకినాడ!
కాకినాడ (Kakinada)పార్లమెంటు నియోజకవర్గానికి తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాన్.. యువ వ్యాపారి ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల(Uday Srinivas tangella)ను ప్రకటించారు. ఈయన పార్లమెంటుకు తొలిసారి పోటీ చేస్తున్నారు. `టీ-టైమ్`(T-Time) పేరుతో ఈయనకు దేశవ్యాప్తంగా తేనీరు వ్యాపారం ఉంది. అనేక మందికి ఉపాధి కూడా కల్పించారు. ఆర్థికంగా బలంగా ఉండడం, యువతను ఆకర్షించడం వంటివి ఈయనకు ప్లస్‌గా మారనున్నాయి. పైగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పిఠాపురం నుంచి పవన్ కూడా పోటీ చేయనున్నారు. దీంతో ఈ ప్రభావం కూడా తంగెళ్లపై పడే అవకాశం ఉంది. ఇక, ఉదయ్ ఎవరనే విషయానికి వస్తూ.. తూర్పు గోదావరి సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన పేరు సుపరిచితమే. తెలంగాణ ప్రభుత్వంలోని పర్యాటక శాఖతో కలిసి ఆయన టీ-టైం ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. 2019 నుంచి ఉదయ్.. పవన్ తో కలిసి తిరుగుతున్నారు.
వారాహి యాత్ర వెనుక!
పవన్ కళ్యాణ్ ఆ మధ్య `వారాహి`(Varahi) వాహనంతో ప్రచారం చేపట్టారు కదా! ఆ వాహనం కొనిచ్చింది.. రిజిస్ట్రేషన్ చేయించింది కూడా ఉదయే కావడం గమనార్హం. వారాహి యాత్ర(Varahiyatra) అందుకే తొలిసారి పిఠాపురంలో నిర్వహించారు. దీనికి కూడా కారణం ఉంది. పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయ్‌ను బరిలో నిలపాలని అనుకున్నారు. దీంతో ఆయన కొనిచ్చిన వాహనాన్ని ఆయన కోసం.. పిఠాపురంలోనే ఫస్ట్ టైం వినియోగించారు. అయితే.. రాజకీయ మార్పుల్లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తుండగా.. కాకినాడ ఎంపీ సీటును మాత్రం ఉదయ్‌కు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన తీర్థం పుచ్చుకున్న ఉదయ్.. పార్టీకి నమ్మకంగా పనిచేయడం ప్రారంభించా రు. పిఠాపురంపై ఆయన మనసు పెట్టిన మాట వాస్తవం. అయితే.. ఇప్పుడు రాజకీయ చర్చలు, సమీకరణల నేపథ్యంలో ఈ సీటును పవనే తీసుకున్నారు. దీంతో ఉదయ్‌ను కాకినాడకు పంపించారు. ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కావడంతో ఈయన కూడా గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని అంటున్నారు జనసైనికులు.