Daily Horoscope for july 19th 2024


మేష రాశి


మేష రాశివారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన వారికి ప్రమోషన్ కి సంబంధించిన అవకాశాలున్నాయి. ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. 


వృషభ రాశి


ముఖ్యమైన పనులను ఇతరులకు వదిలేయవద్దు. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం బావుంటుంది. 


మిథున రాశి


మిథున రాశివారు ఈ రోజంతా బిజీగా ఉంటారు. చర్చలలో ఇతరులపై విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలతో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.   


Also Read: శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి.. చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి - ఈ దీక్ష ఎన్ని రకాలు!


కర్కాటక రాశి


మీ పనిపై దృష్టి పెట్టండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఏ విషయంపైనా ఎక్కువగా ఆలోచించవద్దు. న్యాయపరమైన సమస్యలలో చిక్కుకున్నవారు వాటి నుంచి బయటపడతారు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక చర్చలు మీ దృక్పథాన్ని మారుస్తాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు కోపానికి దూరంగా ఉండాలి.
 
సింహ రాశి


సింహ రాశి వారికి ఈ రోజు శుభదినం. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారు. ప్రేమ వివాహాలకు అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కోసం అవకాశాలు పెరుగుతాయి. వృత్తిపరమైన ఆందోళనలు తొలగిపోతాయి. 


కన్యా రాశి


కన్యా రాశి వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోకూడదు. పెద్దలు ఇచ్చే సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులను కలుస్తారు. 


తులా రాశి


తులా రాశి వారు మీ స్వభావంలో సానుకూలత కొనసాగించాలి. అవివాహితులకు వివాహ నిశ్చయం విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాం ఉంటుంది. మతపరమైన చర్చలు జరుగుతాయి. మీ సలహాల వల్ల ఇతరులు ప్రయోజనం పొందుతారు. 


Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!


వృశ్చిక రాశి


ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ఉద్యోగ ఇంటర్వ్యూకి హాజరవుతున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి భావాలను గమనించండి.  మీ మనసులో  భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోవడం వల్ల మీ మనసు తేలికగా మారుతుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి.


ధనుస్సు రాశి


ధనుస్సు రాశి అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది.  కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరవుతారు. నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు.  మనసులో చెడు ఆలోచనలు తలెత్తవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించాలి.


మకర రాశి


మకర రాశి వారు ఈ రోజు కొన్ని ప్రతికూల వార్తలు వినాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యల కారణంగా విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. అప్పులు తీసుకునే ఆలోచన వద్దు. ఏ పనినీ వాయిదా వేయవద్దు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.


కుంభ రాశి


వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. పిల్లల వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు గత అనుభవాల నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ జీవితంలో కొత్త మలుపు ఉంటుంది.


Also Read: దక్షిణాయణం - ఉత్తరాయణం మధ్య వ్యత్యాసం ఏంటి , ఏది పుణ్యకాలం!


మీన రాశి


ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించండి. కుటుంబ పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న తగాదాలున్నా సమసిపోతాయి. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.