Daily Horoscope for April 2nd 2024 


మేష రాశి


ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో నిరాశజనకమైప ఫలితాలు వస్తాయి. బంధు మిత్రులతో వివాదాలే ఏర్పడే అవకాశం ఉంది.


వృషభ రాశి


ఈరోజు ఈ రాశి వారికి నూతన వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని కీలక పనుల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న సమస్యలు తీరతాయి.


మిథున రాశి


ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్‌ అవుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.   


కర్కాటక రాశి


ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధు మిత్రులతో కలహాలు కలిగే సూచనలున్నవి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. పాత బాకీలు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది.  


సింహ రాశి


ఈ రాశి వారు ఈరోజు కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులలో అవాంతరాలు ఏర్పడే సూచనలున్నాయి. అన్నింటా గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహం ఏర్పడుతుంది.   


కన్య రాశి


ఈ రాశి వారు ఇవాళ కొత్త వెహికిల్‌ కొనే సూచనలు ఉన్నాయి. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు మరింత అనుకూలంగా ఉంటాయి.


తులా రాశి


ఈ రాశి వారికి ఇవాళ పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పురోభివృద్ది కనిపిస్తుంది. స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.


వృశ్చిక రాశి


ఈ రాశి వారికి ఇవాళ ఆర్థిక ఇబ్బందులు వేధించే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పనులలో శ్రమ అధికమవుతుంది. బంధు మిత్రులతో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది.


ధనస్సు రాశి


ఈ రాశి వారికి  ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. కుటుంబ సభ్యులతో విబేధాలు వస్తాయి.


మకర రాశి


ఈరాశి వారికి ఈరోజు సన్నిహితులు సాయం చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత  పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలు కలిసి వస్తాయి.


కుంభ రాశి


ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటంతో మీకు కలిసి వస్తుంది. బంధు మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో లాభసాటిగా సాగుతాయి.


మీన రాశి


ఈరాశి వారు ఈరోజు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి.


Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


ALSO READ: ఇంట్లో పగిలిన వస్తువులు, ఫర్నీచర్ ఉన్నాయా? ఈ కష్టాలు తప్పవు