Somu Veerraju is  unhappy With BJP : ఏపీ బీజేపీలో  ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. సీటు దొరకని సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. నిన్నామొన్నటి వరకు ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న  సోము వీర్రాజు ఆజ్ఞాతంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడంలేదు. పొత్తుల్లో భాగంగా ఈ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ లేదా సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ స్థానాలు బీజేపీకి దక్కలేదు. ఆనపర్తి దక్కింది. అక్కడ్నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు కానీ ఆయన అయన ఆసక్తి చూపించలేదు. పదకొండో సీటు చర్చల్లో ఉందన్న  ప్రచారమూ జరిగింది. కానీ అది కూడా అవకాశం లేకుండాపోయింది.                   


తనకు అవమానం జరిగిందని భావిస్తున్న ఆయన   అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లుగా బీజేపీలో ప్రచారం జరుగుతోంది.  ఆ పార్టీ ముఖ్య నేత‌లు ఆయ‌న‌ను సంప్ర‌దించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా అందుబాటులోకి రావడంలేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజ‌మండ్రిలో జ‌రిగిన బిజెపి నాయ‌కుల‌ స‌మావేశానికి ఆయ‌న హాజ‌రు కాలేదు. అయితే అానారోగ్యం వల్ల రాలేదని బీజేపీ నేతలు సర్ది చెప్పారు కానీ అసలు విషయం అసంతృప్తేనని అంటున్నారు. బీజేపీలో చాలా కాలం నుంచి నుంచి సోము వీర్రాజు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది  తక్కువే. 2004లో కడియం నుంచి బీజేపీ అభ్యర్థిగా  పోటీ చేసినా గెలవలేదు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం బీజేపీ కీలక నేతగా ఎదిగారు. 


2014లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్న సమయంలో రాజమండ్రి సిటీ స్థానం బీజేపీకి వచ్చింది. అప్పుడు సోము వీర్రాజు పోటీ చేసే అవకాశం వచ్చినా.. ఆకుల సత్యనారాయణ కోసం త్యాగం చేశారు. తర్వాత ఆయనకు టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన జీవితంలో ప్రజాప్రతినిధిగా అదే  మొదటి సారి. ఆ పదవి కాలం పూర్తయింది. ఇప్పుడు పొత్తుల్లో   రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి బిజెపీ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని ఎంతో ఆశ ప‌డ్డారు. ఆ సీటు కోసం ఎంతో ప్ర‌య‌త్నాలు చేశారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటును టీడీపీకి కేటాయించారు. టీడీపీ సీనియ‌ర్ నేత గొరంట్ల బుచ్చ‌య్య చౌద‌రీకి ఆ సీటును కేటాయించారు.                          


ఎంతో న‌మ్మ‌కంగా పార్టీ అభివృద్ధికోసం ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించి సోము వీర్రాజుకు సీటు కేటాయించాల్సిన బిజెపీ అధిష్టానం కూడా సోము వీర్రాజుకు మొండి చేయి చూపించ‌ద‌ని అత‌ని స‌న్నిహితులు వాపోతున్నారు. అయితే సోము వీర్రాజు.. హైకమాండ్ నుంచి  గట్టి  హామీ కోసం చూస్తున్నారని అందుకే.. ఆజ్ఞాతంలోకి వెళ్లి.. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు కోసం ఆయన ఈ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. పార్టీ మారే అవకాశం ఉండదని  బీజేపీ వర్గాలు చెబతున్నాయి.