Daily Horoscope for April 12th 2024: 


మేష రాశి


ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు.


వృషభ రాశి


ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


మిథున రాశి


ఈ రోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుతాయి. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి.


కర్కాటక రాశి


ఈ రాశి వారికి  ఈరోజు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.


సింహ రాశి


ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల నుంచి సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


కన్య రాశి


ఈ రాశి వారికి ఇవాళ  కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.


తులా రాశి


ఈ రాశి వారికి ఇవాళ సంఘంలో పెద్దల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయట పడగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.


వృశ్చిక రాశి


ఈ రాశి వారికి ఇవాళ చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. 


ధనస్సు రాశి


ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది.


మకర రాశి


ఈరాశి వారు ఈరోజు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్థి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.


కుంభ రాశి


ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.


మీన రాశి


ఈరాశి వారికి ఈరోజు ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి.


Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


ALSO READ: రామచంద్రుడి నుదుట సూర్యుడు - అయోధ్య రామ మందిరంలో అద్భుతం ఈ ఏడాది శ్రీరామ నవమికే!