Warangal Politics: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితికి మరో షాక్ తగలనుంది. వరంగల్ నగర కేంద్రంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీజేపీలో చేరడానికి పావులు కలుపుతున్నారు. ఉద్యమ సమయం నుండి బీఆర్ఎస్ పార్టీలో నగరంలో కీలక నాయకునిగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా ఎదిగిన నన్నపనేని నరేందర్ పార్టీ మారబోతున్నట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ మేయర్ గా, వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన నరేందర్ వరంగల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున నరేందర్ పార్టీ మారుతు న్నట్లు వస్తున్న వాఆమె కూతురు కొనడర్తలు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నాడనుకున్న నరేందర్ నిర్ణయంపై చర్చ జరుగుతుంది.


గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్. ప్రత్యర్థి కొండ సురేఖ చేతిలో ఓటమి తప్పదు అనుకున్నా నరేందర్ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు మద్దతు తెలిపారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు మద్దతు తెలపడంపై పోలింగ్ రోజు కొండా సురేఖ, ఆమె కూతురు కొండ సుస్మిత పటేల్ నన్నపనేని నరేందర్ తో వాగ్వాదానికి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్ మద్దతు పలికిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు సైతం ఓటమి పాలయ్యారు. 


ఓటమి తర్వాత నుండి సైలెంట్ గా ఉన్న నరేందర్ ఒకసారి పార్టీ మారుతునట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అయితే నన్నపనేని నరేందర్ బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు గత ఎన్నికల పరిస్థితులను బట్టి చూస్తే నిజమనే అనుకోవచ్చు. అధికారానికి దూరం కావడంతో పాటు నియోజకవర్గంలో కొండా సురేఖను ఎదుర్కోవడానికి బీజేపీలో చేరడం తప్ప మరో మార్గం లేదని చెప్పవచ్చు. 


నన్నపనేని నరేందర్ బీజేపీలో చేరడంతో ఇప్పటికిప్పుడు వచ్చిన రాజకీయ లాభం లేకపోయినా తన రాజకీయ మనుగడం కొనసాగించడానికి బీజేపీ తప్ప మరో మార్గం లేదు. దీంతో నన్నపని నరేందర్ బీజేపీలో చేరడం ఖాయమనే చర్చ జరుగుతుంది. నరేందర్ తో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నరేందర్ తో అనుకూలంగా ఉన్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు సైతం నరేందర్ తో బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.