Horoscope Today Telugu 12th November (దిన ఫలాలు నవంబర్ 12, 2023)
మేష రాశి (Aries Horoscope in Telugu)
ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది. ఏదో తెలియని భయంతో మీరు ఇబ్బంది పడవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. మీరు మీ పిల్లల నుంచి శుభవార్త పొందవచ్చు. ఒకరి పట్ల ఆకర్షితులవుతారు. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే, మెరుగైన ప్రేమ జీవితం కోసం ప్రయత్నించండి. మీరు భావోద్వేగాలను అదుపుచేసుకోవడం మంచిది.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu)
ఈ రాశివారి మాటల్లో మాధుర్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. దాంపత్య సంతోషం పెరుగుతుంది. బహుమతులు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీ భాగస్వామి మీ నిజాయితీతో ఆకర్షితులవుతారు . కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా వివాదాలు తగ్గుతాయి.
Also Read: వెలుగులపండుగ దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
మిథున రాశి (Gemini Horoscope in Telugu)
ఈ రాశివారి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కాస్త ఓపికపట్టండి. అనవసరమైన కోపం మానుకోండి. కుటుంబంలో శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించండి. కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లొచ్చు. మిమ్మల్ని సందేహించేవారు మీ చుట్టూ ఉంటారు..కానీ మీ పనులు మీరు చేసుకోండి. మీ మనసులో భావాలను మీ జీవిత భాగస్వామికి చెప్పడం మంచిది. భావోద్వేగాలను పంచుకోవడం మీ బంధం బలపడుతుంది.
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)
ఈ రాశివారి మనస్సులో ఆశ - నిరాశ భావాలు ఉండొచ్చు. విద్యార్థులతు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. మేధోపరమైన పనిలో బిజీ పెరుగుతుంది. ఎక్కువ శ్రమ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీ ప్రియమైనవారికి మనసులో భావాలను వ్యక్తం చేయండి. మాట తూలకండి.
సింహ రాశి ( Leo Horoscope in Telugu)
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగులు స్థలం మారే అవకాశం ఉంది. మీ భాగస్వామి సహకారంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సవాళ్లు ఎదుర్కోవాల్సిన సమయం ఇది. బంధాలను బలపర్చుకునేందుకు ప్రయత్నించండి. ప్రేమికులకు ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.
Also Read: దీపాల పండుగా లేదా పటాకులు పేల్చే పండుగా - బాణసంచా కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది!
కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
ఈ రాశివారి ఆలోచనలో హెచ్చు తగ్గులు ఉంటాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితుని సహాయంతో మీకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ ఆందోళనలను మీ భాగస్వామికి తెలియజేయడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు మీరు మీ భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళిక, ఆర్థిక లక్ష్యాలు లేదా గృహ బడ్జెట్‌ను రూపొందించడం గురించి చర్చించవచ్చు. సంబంధంలో స్థిరత్వం పెరుగుతుంది.
తులా రాశి (Libra Horoscope in Telugu)
ఈ రాశివారు శాంతిని కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉంటుంది. స్నేహితుల సహాయంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో మీ జీవితంలోని కొన్ని ప్రత్యేక అంశాలను పంచుకోవడం అసౌకర్యంగా ఉంటుంది. ఇది మీ గత అనుభవాల వల్ల కావచ్చు. అయితే కొన్ని విషయాలను దాచడం వల్ల మీ సంబంధానికి ఆటంకం కలుగుతుందని గుర్తుంచుకోండి.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మేథోపరమైన పనిలో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. మీ సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన రోజు ఇది. మంచి సంబంధంలో భావోద్వేగ బంధం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. మీ భాగస్వామితో మీ సంబంధం మీపై ఎక్కడ సానుకూల ప్రభావం చూపుతుందో గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ బంధం బలపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తనకోసం సమయాన్ని వెచ్చించాలి.
Also Read : దీపావళి రోజు పూజించాల్సిన దక్షిణావర్తి శంఖం విశిష్టత ఏంటో తెలుసా!
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
మనస్సులో ఆశ - నిరాశ భావాలు ఉండవచ్చు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబంలో శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. మీ భాగస్వామితో గడిపిన క్షణాల ద్వారా మీ సంబంధం బలపడుతుంది. మీ భాగస్వామితో చెప్పాలి అనుకున్న విషయం నేరుగానే చెప్పండి..ఇది మీ సంబంధంలో పరస్పర అవగాహనను పెంచుతుంది. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ కాలం గడిపినప్పటికీ, మీ భాగస్వామిని వీలైనంత వరకు తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మకర రాశి (Capricorn Horoscope in Telugu)
మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాల వల్ల సంతోషం పెరుగుతుంది. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. అనుకోని టెన్షన్ పెరుగుతుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న వారికి, రిలేషన్‌షిప్‌ను కొత్తగా ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇది ప్రేమ జీవితంలోని చేదును దూరం చేస్తుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది.
Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
సంయమనంతో ఉండాలి. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అదనపు ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో కార్యాలయంలో చాలా మార్పులు ఉంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మరియు మీ భాగస్వామి ఒకరితో ఒకరు సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తారు. గతంలో ఉన్న వివాదాలకు చెక్ పెట్టేందుకు ఈ సమయాన్ని వినియోగించుకోండి. మానసిక బంధం మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయండి.
మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఈ రాశివారు ఏదో విషయంలో ఆలోచనలో ఉంటారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉండొచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులకు ఉన్నత చదువులకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం బావుంటుంది. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. ప్రేమలో ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు..కొన్ని ప్రత్యేక క్షణాలు గుర్తిచేయడం ద్వారా మీ బంధం మెరుగుపడుతుంది.
Also Read : దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!