Daily Horoscope for 31 August 2024 


మేష రాశి


ఈ రోజు మీ మనోబలం పెరుగుతుంది. సానుకూల స్వభావం ఉన్న వ్యక్తులతోనే స్నేహం చేయండి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలుంటాయి. రచనతో  అనుబంధం ఉన్న వ్యక్తులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. 


వృషభ రాశి 


అనవసరమైన పనుల్లో విలువైన సమయాన్ని వృథా చేయకండి.  కళ, సాహిత్యం మరియు సంగీతం పట్ల ఆసక్తి చూపుతారు. దూర ప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాత మీరు ఉత్సాహంగా ఉంటారు.
 
మిథున రాశి


ఈ రోజు షేర్ మార్కెట్,  బ్యాంకింగ్‌ రంగాల్లో ఉండేవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. పిల్లల ప్రవర్తనతో చాలా సంతోషిస్తారు.  మిమ్మల్ని మార్గదర్శకులుగా భావించేవారున్నారు..మీ ప్రవర్తనను ఆదర్శంగా ఉంచుకోండి.  పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. నూతన వ్యక్తులను కలుస్తారు. 


Also Read: సెప్టెంబరు 2024 లో ఈ రాశులవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు - ఆర్థికాభివృద్ధి ఉంటుంది !


కర్కాటక రాశి 


మీరు ఈ రోజు ఏ పని ప్రారంభించినా మంచి ప్రయోజనాలు  పొందగలరు. రోజంతా బిజీ బిజీగా ఉంటారు. పదవి, అధికారంపై ఆసక్తి పెరుగుతుంది. మీ కీర్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


సింహ రాశి


ప్రతి పనిని సరిగ్గా చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ పనుల్లో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రత్యర్థులు మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు జాగ్రత్త. వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో ప్రత్యేక సమయం స్పెండ్ చేస్తారు. 


కన్యా రాశి 


ఈ రోజు మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు అందుతాయి.  కొత్తగా, ప్రయోగాత్మకంగా ఏదైనా చేయాలనే కోరిక ఉంటుంది. మీరు రోజువారీ పనులపై ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. 


తులా రాశి


ఆధ్యాత్మిక ప్రదేశంలో ఒంటరిగా  గడుపుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. అధికారులతో మీకున్న సంబంధాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రయాణాలను ఆస్వాదిస్తారు. 


Also Read: వినాయకుడి రాశి ఏంటి -గణనాథుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండే రాశులేంటి!


వృశ్చిక రాశి


మీ జీవిత భాగస్వామితో  మంచి సమయం స్పెండ్ చేస్తారు. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 


ధనస్సు రాశి


ఈ రోజు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్ రంగానికి సంబంధించిన వ్యక్తులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం ఇస్తారు.
 
మకర రాశి


విద్యార్థులకు శుభ సమయం. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న పాత పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. మీ పనిని ఇతరులపై రుద్దొద్దు. అనవసర ఒత్తిడికి లోనుకావొద్దు. 


కుంభ రాశి


ఈ రోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.  సమయానుకూలంగా వర్కింగ్ స్టైల్‌లో మార్పులు తీసుకురావడం సముచితంగా ఉంటుంది. మార్కెటింగ్ , మీడియాతో అనుబంధించబడిన వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందవచ్చు. 


Also Read: మీ రాశి ప్రకారం మీరు పూజించాల్సిన వినాయకుడి రూపం ఇదే!


మీన రాశి


ఈ రాశివారు రోజంతా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.