Lord Ganesha Favourite Zodiac Signs : పార్వతీ తనయుడి ఆశీస్సులుంటే ఏ రంగంలో అయినా విజయం తథ్యం. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి సకలనదుల్లో స్నానమాచరించివచ్చినట్టు సోదరుడికి కనిపించి..విఘ్నాధిపత్యం పొందాడు వినాయకుడు. అప్పటి నుంచి ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రార్థిస్తే ఎలాంటి అడ్డంకులు ఉండవని చెబుతారు. ఎల్లవేళలా భక్తులను అనుగ్రహించే లంబోదరుడు.. కొన్ని రాశులవారిపై ప్రత్యేక అనుగ్రహాన్ని చూపిస్తాడట. ఆ రాశులేంటో చూద్దాం..
 
మేష రాశి (Aries)


వినాయకుడి అనుగ్రహంతో మేష రాశివారు తామున్న రంగంలో ఉన్నతంగా ఎదుగుతారు. చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ అవుతారు. అడ్డంకులను అధిగమిస్తారు. మీ ప్రతిభతో మంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు లేదంటే మంచి ఇంక్రిమెంట్ సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. విద్యార్థులకు శుభసమయం.


Also Read: మీ రాశి ప్రకారం మీరు పూజించాల్సిన వినాయకుడి రూపం ఇదే!
  
వృషభ రాశి  (Taurus)


వృషభం అంటే ఎద్దు.. పరమేశ్వరుడి వాహనం అయిన నంది అని అర్థం. అందుకే ఈ రాశులవారిపై వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందంటారు. ఈ రాశివారు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే వారి జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవడంతో పాటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనుల్లో ఎదురైన ఎంతకష్టమైన అడ్డంకులను అయినా అధిగమిస్తారు. నూతన ప్రారంభాలకు, కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు ఈ వినాయకచవితి మీకు అత్యంత శుభకరం.  


కన్యా రాశి (Virgo) 


ఇది వినాయకుడి రాశి...అందుకే ఈ రాశివారిపై వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వినాయకచవితి సందర్భంగా ఈ రాశివారు విశేష ఫలితాలు పొందుతారు. ఎలాంటి క్లిష్టమైన సమస్యలను అయినా అపూర్వమైన తెలివితేటలు, సామర్థ్యంతో పరిష్కరించుకుంటారు. పార్వతీ తనయుడి అనుగ్రహంతో వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో ఆశించనంత వెలుగొస్తుంది. నూతన ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించేందుకు వినాయకచవితి మీకు కలిసొస్తుంది. అట్టడుగు స్థాయిలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.  


వృశ్చిక రాశి (Scorpio)


వృశ్చిక రాశివారిపై గణనాథుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ రాశివారు భక్తితో వినాయకుడిని పూజిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే ధైర్యం సొంతం అవుతుంది...భావోద్వేగాలను అదుపుచేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు.  


Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!


మకర రాశి (Capricorn)


మకర రాశివారిపై గణేషుడి ఆశీర్వచనాలు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి.   ఈ రాశివారిలో మంచి క్రమశిక్షణ, సంకల్పం, కష్టపడే తత్వం ఉంటాయి. కెరీర్లో పురోగతికి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మీకు ఇదే మంచి సమయం. మీకున్న వనరులను సక్రమంగా నిర్వహించుకోగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ఏ పని ప్రారంభించినా  కార్యసిద్ది తథ్యం. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!