Daily Horoscope for 18 August 2024
మేష రాశి
ఈ రోజు పని తీరులో మార్పులు చేర్పులు చేసుకుంటారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. వెంటనే ఎవరి సలహాను పాటించవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం బావుంటుంది
వృషభ రాశి
షేర్ మార్కెట్ నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది, అవసరానికి మించి ఖర్చు చేయకండి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ప్రవర్తనలో మార్పులు మీరు గమనిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి
ఈ రాశివారు పెట్టుబడులు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏదో విషయంపై ఎక్కువ ఆలోచిస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
Also Read: రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి - రాఖీ కట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఇదే!
కర్కాటక రాశి
కోపాన్ని నియంత్రించుకోండి. ఈ రోజు మీకు గొప్ప రోజు అవుతుంది. ప్రేమికులు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. పెద్దల దీవెనలు అందుకుంటారు.
సింహ రాశి
నూతన విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతలను అందరి ముందు బహిర్గతం చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి
కన్యా రాశి
ఈ రోజు మీరు పాత స్నేహితులను కలవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అనవసర చర్చలు చేయవద్దు. సామాజిక సేవలో పాల్గొంటారు. బలవంతంగా ఏ పనీ చేయడానికి ప్రయత్నించవద్దు. తెలియని భయం మీ పనికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి
తులా రాశి
వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. బంధువులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారంపై నియంత్రణ ఉండాలి. పెద్దలకు సేవ చేయడం వల్ల ప్రశాంతత ఉంటుంది.
వృశ్చిక రాశి
మీరు కెరీర్‌కు సంబంధించి మంచి అవకాశాలు పొందుతారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వస్తాయి. వాహనం జాగ్రత్తగా నడపండి.
Also Read: రక్షాబంధన్ ఎలా మొదలైంది - రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!
ధనస్సు రాశి
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. పనికిరాని పనుల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. మితిమీరిన ఖర్చులు మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి.
మకర రాశి
ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం, ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. దూరప్రాంత ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. వాహనం జాగ్రత్తగా నడపండి
కుంభ రాశి
అనుభవజ్ఞుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు. శత్రువులకు దూరంగా ఉండండి. ఈ రోజు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఈరోజు మంచి రోజు కానుంది. ఉద్యోగంలో ఉండే చికాకులు తొలగిపోతాయి.
Also Read: రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందే - రక్షాబంధన్ వేడుకలకు వీళ్లంతా దూరం!
మీన రాశి
ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. మీ రహస్య విషయాలను ఎవరికీ చెప్పకండి. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. సహోద్యోగులతో వివాద సూచనలున్నాయి జాగ్రత్త...
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.