Daily Horoscope for 4 August 2024
మేష రాశి
ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధాలలో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. కష్టపడి చేసే పనిలో విజయం సాధిస్తారు. సౌకర్యాలు పెరుగుతాయి. కొంతమంది స్నేహితులు మీపై కోపంగా ఉండవచ్చు.
వృషభ రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో క్రమశిక్షణ పాటించండి. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేయండి. శుభవార్తలు అందుకుంటారు. మీ సోదరులు, సోదరీమణులతో మంచి ప్రవర్తనను కొనసాగించండి. ఇంట్లో పెద్దల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు
మిథున రాశి
ఈ రోజు మీరు పెద్దల నుంచి ఆశీర్వాదం పొందుతారు. రాజకీయ పరిచయాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. మీ మార్గదర్శం చాలామందికి ఉపయోగపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!
కర్కాటక రాశి
మీరు ఈరోజు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు
సింహ రాశి
ఈ రోజు ప్రతికూల ఆలోచనలు తలెత్తవచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఈ రోజు ఎక్కువ దూరం ప్రయాణించాలన్న ఆలోచన విరమించుకోండి. ప్రియమైనవారి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. బంధువులను కలుస్తారు.
కన్యా రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో అమ్మకాల పెరుగుదలతో లాభాలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు
తులా రాశి
ఈ రోజు మీ ప్రియమైనవారికి మీ మనసులో మాట చెప్పేందుకు మంచిది. ఆరోగ్యం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయ పనులపై ఆసక్తి ఉండదు. స్నేహితులతో కలసి పార్టీలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రోజు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొత్త వాహనం, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. పెండింగ్లో ఉన్న డబ్బులు చేతికందుతాయి. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. విద్యార్థులు కొత్త కోర్సులో ప్రవేశానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
ధనస్సు రాశి
ఈ రోజు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి పొందడంలో ఇబ్బంది పడతారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉంటాయి. స్నేహితుల ప్రవర్తన వల్ల మీరు బాధపడతారు. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు.
Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!
మకర రాశి
ఈ రోజు మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. మీ జీవిత భాగస్వామితో కలసి షికారుకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని కనబరుస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ దినచర్య కొంచెం బిజీగా ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో కొన్ని సమస్యలుంటాయి. శత్రువులు పెరుగుతారు అప్రమత్తంగా వ్యవహరించండి
మీన రాశి
ఈ రోజు మీ మాటతీరుకి అందరూ ఆకర్షితులవుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకూ ఉండే వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.