Naag Panchami 2024 Date


నవనాగ నామ స్తోత్రం


అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!


నాగుల చవితి ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. కార్తీక శుద్ధ చవితిరోజు కొన్నిప్రాంతాల్లో...శ్రావణశుద్ధ చవితి రోజు మరికొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా రాయలసీమ , తెలంగాణ ప్రాంతాల్లో శ్రావణశుద్ధ చవితి రోజే పుట్టలో పాలుపోస్తారు. ఆ మర్నాడు వచ్చేది గరుడపంచమి. రెండింటిని కలిపి నాగపంచమిగా పాములను పూజిస్తారు. నాగపంచమి సందర్భంగా పాములను పూజిస్తే జాతకంలో ఉండే రాహుకేతు దోషాలతో పాటూ కాలసర్పదోషం, గ్రహదోషాలు తొలగిపోతాయి. వివాహం, సంతానానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సమసిపోతాయని భక్తుల విశ్వాసం. 


Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!


ఆగష్టు 08  నాగులచవితి - గురువారం రాత్రి 9 గంటల 47 నిముషాలవరకూ చవితి ఘడియలున్నాయి...అంటే ఆ రోజు సూర్యోదయం నుంచి చవితి ఉంది...తిథులు తగులు, మిగులు రాలేదు కాబట్టి ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేదు..


ఆగష్టు 09 గరుడపంచమి - శుక్రవారం రాత్రి 11 గంటల 49 నిముషాల వరకూ ఉంది.నాగులచవితి మర్నాడు వచ్చే ఈ పంచమిని గరుడ పంచమి అంటారు...


పాములను హింసించిన సర్పదోషం, జాతకంలో ఉండే కాలసర్పదోషం నుంచి విముక్తి పొందేందుకు నాగులచవితి రోజు పూజచేయడం చాలా ముఖ్యం. జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలన్నీ రాహు-కేతు మధ్య ఉంటే దాన్నే కాలసర్ప దోషం అంటారు. ఈ దోషం ఉంటే అడుగడుకునా ఇబ్బందులే,  వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో అన్నింటా ఆటంకాలే...మనశ్సాంతి ఉండదు. వీటన్నింటి నుంచి నివారణకోసం నాగులచవితి రోజు పాములను పూజిస్తారు. మరికొందరికి తరచూ పాములు కలలో కనిపిస్తుంటాయి. ఆ కలలు మంచివా కాదా అన్న విషయం వదిలేస్తే..పదే పదే పాములు కనిపించడంతో భయపడుతుంటారు. అలాంటివారు కూడా నాగులచవితిరోజు నాగేంద్రుడిని పూజిస్తే భయపెట్టే కలలు ఆగిపోతాయని చెబుతారు పండితులు.  పరిహారం కోసం కొన్ని పాటిస్తారు.


Also Read: పాపం చేసిన వెంటనే దేవుడు శిక్ష వేసేయొచ్చు కదా..వచ్చే జన్మవరకూ ఎందుకు ఆగాలి!


నాగుల చవితి రోజు ఇంటిని శుభ్రంచేసేటప్పుడు ఉప్పు, ఆవుమూత్రం నీళ్లలో కలపండి. అనంతరం గుగ్గిలంలో ఇల్లంతా ధూపం వేయాలి.  
బంగారం లేదా వెండి లేదా రాగి పామును కొనుగోలు చేసి....ఇది కూడా లేకుంటే పాము ఆకారాన్ని తయారు చేసి కానీ  దానికి  అభిషేకం చేసి నవనాగ నామ స్తోత్రం పఠించండి. సర్పసూక్తంతో పాటూ పరమేశ్వరుడిని పూజించండి..గాయత్రి మంత్ర జపం చేయండి.  జంట పాములకు పచ్చి పాలతో అభిషేకం చేసి..చలిమిడి, చిమ్మలి నైవేద్యంగా సమర్పిస్తే కాలసర్పదోష ప్రభావం , సర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో పూజ అనంతరం శివాలయానికి వెళ్లి కొద్దిసేపు సేవ చేయండి. ఈ రోజు భూమిని తవ్వడం, మట్టిని తవ్వడం లాంటివి చేయకూడదు. వ్యవసాయ పనులు చేసేవారు కూడా ఈ రోజు పొలాల్లో పనిచేయరు..నాగలిని అస్సలు వినియోగించరు.  


Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!


గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..