Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు ఆగష్టు 03 ఎపిసోడ్)


రంగ‌గా శైలేంద్రని నమ్మించి రీఎంట్రీ ఇచ్చిన రిషి..అసలు సిసలు నాటకం మొదలెట్టాడు. తను రంగా కాదు రిషి అని కేవలం వసుధారకు మాత్రమే తెలుసు. నిజంగానే రిషి అన్నది మహేంద్ర అభిప్రాయం. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే... రిషిధార చంద్రుడిని చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇంతలో అక్కడకు వస్తాడు మహేంద్ర. మావయ్య నేను జగతి మేడంని చూశానంటూ వసుధార అనడంతో నాక్కూడా చూపించమ్మా అంటాడు మహేంద్ర. అప్పుపుడు కళ్లుమూసుకోమని చెప్పి చంద్రుడు, నక్షత్రాలు అంటూ జగతిని చూపిస్తుంది వసుధార. ఆ తర్వాత అనుపమ-మను గురించి డిష్కషన్ వస్తుంది. 


వసుధార: అనుప‌మ‌, మ‌ను క‌నిపించ‌డం లేదు...ఎక్క‌డికి వెళ్లార‌ు
మహేంద్ర: వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోయాలు. కానీ  త‌న తండ్రి ఎవ‌ర‌న్న‌ది మ‌న‌కు ఇంకా తెలియ‌లేద‌ు
వసుధార: తాను రాసిన లెట‌ర్ మ‌నుకు అంద‌లేద‌నే నిజం తెలిసి షాక‌వుతుంది. ఆ లెట‌ర్ మ‌ను కంట ప‌డ‌కుండా శైలేంద్ర‌నే ఏదో చేసి ఉంటాడ‌ను అనుకుంటుంది. 


Also Read: ఆగష్టు 03 రాశిఫలాలు - ఈ రోజు మీరు అనుకున్న ఫలితాలు రావడంతో ఉత్సాహంగా ఉంటారు


శైలేంద్ర-పాండు
వ‌సుధార చంప‌కుండానే చంపాన‌ని అబ‌ద్దం చెప్పిన పాండుకి కాల్ చేస్తాడు శైలేంద్ర. కానీ పాండుగాడు తెలివిగా... సర్  పాతిపెట్టిన గోతిని త‌వ్వి చూశామ‌ని అందులో వసుధార డెడ్‌బాడీ క‌నిపించ‌డం లేద‌ని అంటాడు. చంపి పాతిపెట్టిన శ‌వం క‌నిపించ‌డం లేద‌ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌మ‌ని శైలేంద్ర వెట‌కారంగా చెబుతాడు కానీ సరే అని కాల్ కట్ చేసేస్తాడు పాండు. ఏదేమైనా ఎండీ సీటు దక్కంచుకోవాల్సిందే అనుకుంటాడు శైలేంద్ర


రిషి-బుజ్జి
ఆటో డ్రైవర్ బుజ్జికి కాల్ చేసిన రిషి..నానమ్మ ఎలా ఉందని అడుగుతాడు. నానమ్మ నన్ను నిలదీస్తోంది, నువ్వెక్కడున్నావని అడుగుతోందని బుజ్జి చెబుతాడు. ఇంతలో సరోజ వచ్చి..బుజ్జి చేతినుంచి ఫోన్ లాక్కుంటుంది.
సరోజ: ఎక్క‌డున్నావు...నువ్వు వెళ్లిన‌ప్ప‌టినుంచి వ‌సుధార కూడా క‌నిపించ‌డం లేద‌ు ఇద్ద‌రు క‌లిసే ఉన్నారా 
రిషి: సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు
సరోజ: నిన్ను వెతుక్కుంటూ నేనే వ‌స్తాన‌ని స‌రోజ ఫోన్ క‌ట్ చేస్తుంది
శైలేంద్ర వెంట రంగా వెళ్లాడ‌నే నిజం చెప్పేస్తాడు బుజ్జి. అసలు శైలేంద్ర‌, రంగాకు ఉన్న సంబంధం ఏంటి? వ‌సుధార ఎక్క‌డికి వెళ్లిందో క‌నిపెట్టాల‌ని స‌రోజ ఫిక్స‌వుతుంది.


అనుప‌మ - మహేంద్ర
అనుప‌మ‌కు కాల్ చేస్తాడు మ‌హేంద్ర‌. కానీ మ‌హేంద్ర‌తో మాట్లాడ‌టం ఇష్టం లేక ఫోన్ లిఫ్ట్ చేయ‌దు అనుప‌మ‌. దాంతో మ‌నుకు కాల్ చేసి రిషి, వ‌సుధార తిరిగి వ‌చ్చార‌నే గుడ్‌న్యూస్ చెబుతాడు మ‌హేంద్ర‌. . రిషి తిరిగి వ‌చ్చాడ‌ని తెలియ‌గానే మ‌ను, అనుప‌మ సంతోషిస్తారు. 
 
వ‌సుధార‌, రిషి దగ్గరకు వచ్చిన శైలేంద్ర..రిషితో మాట్లాడాలి అంటాడు. రిషి సర్ మీతో మాట్లాడరు అని చెప్పేస్తుంది వసుధార 
శైలేంద్ర: రిషి ఇన్నాళ్లు నా ప‌క్క‌న లేక‌పోవ‌డంతో నా కుడిభుజం విరిగిపోయిన‌ట్లు అయ్యింది..నాకు అండ‌గా ఉండే త‌మ్ముడు దూర‌మైన బాధ ఎంత‌గానో వేధించింద‌ని రిషిపై ప్రేమ ఉన్న‌ట్లు న‌టిస్తాడు
వసుధార: ఎందుకు లేని ప్రేమ‌ను న‌టిస్తారు
రిషి: అలా అంటారేంటి మేడ‌మ్ గారు అంటూ రంగాలా మాట్లాడుతాడు
వసుధార: న‌న్ను మేడ‌మ్ అని అంటున్నారేంటి? ఆ మేడ‌మ్ ఎవ‌రు 
శైలేంద్ర: వ‌సుధార‌ను రిషి మేడ‌మ్ అని పిల‌వ‌డం చూసి శైలేంద్ర కంగారు ప‌డ‌తాడు. టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌డానికి తెగ ప్రయత్నాలు చేస్తాడు. 
రిషితో ఒంట‌రిగా మాట్లాడాల‌ని శైలేంద్ర ఎంత ప్ర‌య‌త్నించిన అక్క‌డి నుంచి మాత్రం వ‌సుధార క‌ద‌ల‌దు. ఏం మాట్లాడినా నా ముందే మాట్లాడాల‌ని బెట్టు చేస్తుంది. చివ‌ర‌కు రిషి బ‌తిమిలాడి ఆమెను అక్క‌డినుంచి పంపిస్తాడు.


Also Read: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!


రిషికి శైలేంద్ర వార్నింగ్‌..
వ‌సుధార వెళ్లిపోగానే రిషికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌. నువ్వు రంగా అనే విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ు వ‌సుధార‌తో క్లోజ్ ఉంటే బాగుండ‌ద‌ని, హ‌ద్దులు దాట‌కుండా లిమిట్స్‌లో ఉండ‌మ‌ని హెచ్చ‌రిస్తాడు. వ‌సుధార పిలిచిన‌ప్పుడు వెళ్ల‌క‌పోతే  మ‌న నాట‌కం బ‌య‌ట‌ప‌డుతుంద‌ంటారు రిషి. నాకు ఇక్క‌డ ఉండాల‌ని లేద‌ు  వెళ్లిపోవాల‌ని అనిపిస్తుంద‌ని అంటాడు. నేను రిషిని కాదు రంగా అని తెలిసిన రోజు న‌న్ను ఎందుకు మోసం చేశార‌ని ఆమె నిల‌దీస్తే ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌డం లేద‌ు..అంతకన్నా ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోతానని పట్టుబడతాడు. శైలేంద్ర బతిమలాడేలోగా వసుధార అక్కడకు వస్తుంది. శైలేంద్ర ఏం మాట్లాడాలని నిలిదీస్తుంది. శైలేంద్ర-రిషి ఏం చెప్పాలో తెలియక తడబడిపోతాడు. అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన దేవయాని కూడా కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ రంగాలో ఉన్న రిషి...వసుధార మేడం అని పిలిచి మళ్లీ దొరికిపోతాడు. అసలు రిషిని చూస్తుంటే ఏదో అనుమానం వస్తోందంటుంది వసుధార..కానీ దేవయాని సర్దిచెప్పి అక్కడి నుంచి వసుధారని పంపించేస్తుంది.  


గుప్పెడంతమనసు ఆగష్టు 04 ఎపిసోడ్ లో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది....