Horoscope Today 13 Augsut 2024: ఆగష్టు 13 రాశిఫలాలు - ఈ రాశివారు ఈ రోజు ఓ పెద్ద సమస్య నుంచి బయటపడతారు!

Horoscope Prediction 13 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

Daily Horoscope for 13 August 2024 

Continues below advertisement

మేష రాశి

ఈ రోజు మీ వ్యక్తిగత సమస్యలను ఎవరితోనూ పంచుకోవద్దు. పాత స్నేహితులను కలుస్తారు. ఉద్యోగం, వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్నాయి అప్రమత్తంగా ఉండండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

వృషభ రాశి

ఈ రోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. మీ బాధ్యతల విషంలో విధేయత చూపించండి. మీ ఆలోచనలు జీవిత భాగస్వామితో పంచుకోండి. 

మిథున రాశి

ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలపై  ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఒత్తిడులు మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వవద్దు. విద్యార్థులు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సలహాతో అందరూ ప్రయోజనం పొందుతారు.

Also Read: వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా అంటారా..అసలు పెళ్లెందుకు చేసుకోవాలో తెలుసా!

కర్కాటక రాశి

ఈ రోజు మీరు ఓ పెద్ద సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ  సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభఫలితాలున్నాయి. 

సింహ రాశి 

ఈ రోజు పిల్లల విషయంలో భయాందోళనలు తలెత్తే అవకాశం ఉంది. గృహ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతాయి. ప్రేమ సంబంధిత విషయాలలో మీరు నిరాశ చెందవచ్చు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. 

కన్యా రాశి

ఈ రోజు అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆన్ లైన్ వ్యాపారులు లాభపడతారు. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

తులా రాశి

ఈ రోజు మీకు ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి..ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండొద్దు.  కమీషన్ సంబంధిత విషయాలకు మంచి రోజులు. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తుల  మార్గదర్శకత్వం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అనవసర విషయాలకు సమయం వృధా చేయవద్దు

Also Read: శ్రావణమాసంలో బంగారం తప్పనిసరిగా కొంటారు..ఎందుకో తెలుసా!

వృశ్చిక రాశి

ఈ రోజు సుదీర్ఘ సంభాషణ ఉండవచ్చు. కార్యాలయంలో ఉద్యోగుల పని సామర్థ్యం పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో మీ కోరిక మేరకు పనులు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది 

ధనుస్సు రాశి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణానికి ఈరోజు ఆహ్లాదకరమైన రోజు కాదు. సహోద్యోగులు ఏదైనా విషయంలో మీతో విభేదించవచ్చు. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.  

మకర రాశి

ఈ రోజు అనుకోని ఖర్చులుంటాయి. ఓ శుభవార్త వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహనం, ఓపికతో చేసేపనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రియమైన వారి భావాలు గౌరవించండి.  

 కుంభ రాశి

స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు..పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచిరోజు. కొత్తగా ప్రారంభించే కార్యక్రమాల విషయంలో మీ జీవిత భాగస్వామి నుంచి సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వొద్దు. వ్యాపారులు మంచి లాభాలు ప౧ందుతారు. 

Also Read: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!

మీన రాశి 

ఈ రోజు మీ శత్రువులు చురుకుగా ఉంటారు..అప్రమత్తంగా ఉండాలి. మీ మాటతీరు, ప్రవర్తన మీపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మీ బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Continues below advertisement
Sponsored Links by Taboola