Daily Horoscope for 1 August 2024


మేష రాశి


ఈ రోజు పెద్ద ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. మీపై మీకున్న విశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు క్లిష్ట సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 


వృషభ రాశి


ఈ రోజు మీరు వ్యాపారంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో  ఒత్తిడికి లోనవుతారు. అనవసరమైన ఆలోచనలతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. కార్యాలయంలో బిజీగా ఉంటారు. 


మిథున రాశి


ఈ రోజు మీరు భాగస్వామ్యానికి సంబంధించిన పనులలో లాభపడతారు. మానసిక ప్రశాంతత కోసం ఏకాంతంగా ఉండాలి అనుకుంటారు. ఆర్థిక సంబంధిత సమస్యలు దూరమవుతాయి.అంకితభావంతో ఉత్సాహంతో పని చేస్తారు.  నిగూఢ శాస్త్రాలపై ఆసక్తి చూపిస్తారు. 


Also Read: 9 నాగశక్తులను ప్రసన్నం చేసుకునే కవచం - సర్పదోషం, నాగదోషం సహా సకల దోషాలకు పరిహారం!


కర్కాటక రాశి


ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని కారణాల వల్ల గొడవ పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అనుకోని సమస్యలు వచ్చిపడతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 


సింహ రాశి


ఈ రోజు మీ ఆధిపత్యం పెరుగుతుంది. అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మీరు ప్రియమైన స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఆర్థిక   లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. మీరు కొత్త పనులపై ఆసక్తి చూపుతారు. మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేట్టు అయితే ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 


కన్యా రాశి


ఈ రోజు ఆత్మగౌరవం గురించి ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు రోజు చాలా మంచిది. మీ ఆసక్తికి  అనుగుణంగా పని చేయడం ద్వారా  ప్రయోజనం పొందుతారు.  సాంకేతిక పనులలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.


తులా రాశి


ఈ రోజు మీరు వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. స్నేహితుల ద్వారా శుభవార్తలు అందుకోవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి 


వృశ్చిక రాశి


ఈ రోజంచా మీరు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి లేకపోతే మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి. మీ రహస్యాన్ని ఇతరులతో పంచుకోవద్దు. స్వార్థపూరిత స్నేహితుల వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. 


ధనుస్సు రాశి


ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఏదైనా పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు గృహ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసేందుకు ప్రయత్నించండి. 


Also Read: ఆగష్టు 04 చుక్కల అమావాస్య..ఇలా చేస్తే మీరు ఉహించనంత ఫలితం పొందుతారు!


మకర రాశి


ఈ రోజు మీ వైవాహిక జీవితం బావుంటుంది. మీ పనితీరు అధికారులను మెప్పించేలా ఉంటుంది.  చాలా కాలంగా ఉన్న ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. పని సమృద్ధిగా ఉన్నప్పటికీ, మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీతో పనిచేసే వారిపై విశ్వాసాన్ని కొనసాగించండి


కుంభ రాశి


ఈ రోజు మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశాలను పొందుతారు. కానీ మీ అజాగ్రత్త కారణంగా మీరు ఆ అవకాశాలను కోల్పోవచ్చు. ఈరోజు ప్రేమ సంబంధాల విషయంలో కొంత సీరియస్‌ గా ఉండండి.  ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి.


మీన రాశి


ఉద్యోగులు రోజంతా బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు మీ భవిష్యత్తు గురించి కొంచెం భయపడతారు, ఆలోచిస్తారు. శ్రేయోభిలాషులను అగౌరవపరచవద్దు. కుటుంబ సమస్యలు ఉంటాయి. ప్రేమికులు శుభవార్త వింటారు.  


Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.