Festivals in August 2024:  తెలుగు పంచాంగం ప్రకారం ఆగష్టు 05 సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం. విష్ణువు జన్మ నక్షత్రం  శ్రవణం , ఆ పేరుమీద వచ్చిన నెల కావడంతో శ్రీమహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. భారతీయ విద్యా విధానంలో అధ్యయన పక్రియ ప్రారంభమయ్యేది శ్రావణంలోనే. 2024 లో ఆగష్టు (శ్రావణమాసం) లో  ఏ పండుగలు ఎప్పుడొచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆగష్టు 05 శ్రావణ శుద్ధ పాడ్యమి

శ్రావణాసం మొదటి రోజు..ఈ రోజు నుంచి పూర్ణిమ వచ్చే వరకు వచ్చే 15 రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు  పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరాలు దేవతలకు అర్పించడమే పవిత్రారోపణం  ఆగష్టు 06 శ్రావణ శుద్ధ విదియ

శ్రావణ శుద్ధ విదియను ‘మనోరథ ద్వితీయ’ అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి వాసుదేవుడిని పూజించి..సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయాలి 

ఆగష్టు 07 శ్రావణ శుద్ధ తదియ

ఈరోజు ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో  మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం గురించి కృత్యసార సముచ్చయం అనే గ్రంధంలో ఉంది .

Also Read: ఆర్థిక సమస్యలు, నరఘోష , శత్రుభయం నుంచి విముక్తి కల్పించే సంకష్టహర చతుర్థి వ్రతం - ఎలా చేయాలంటే!

ఆగష్టు 08 శ్రావణ శుద్ధ చవితి 

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితిని రాయలసీమ ప్రాంతంలో నాగులకు పూజ చేస్తారు. విఘ్నేశ్వరుడి పూజకు ఈ తిథి అత్యుత్తమం 

ఆగష్టు 09 శ్రావణ శుద్ధ పంచమి - గరుడ పంచమి

శ్రావణ శుద్ధ చవితి తర్వాత రోజు వచ్చే పంచమనిని నాగ పంచమి, గరుడ పంచమి అంటారు. ఈ రోజు విశిష్టత గురించి శివుడు పార్వతీదేవికి చెప్పాడని ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ఉంది.  

ఆగష్టు 10 శ్రావణ శుద్ధ షష్ఠి

ఈ రోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరం  ఆగష్టు 11 శ్రావణ శుద్ధ సప్తమి

ఈ రోజున ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరిస్తారు..ఇది సూర్యారాధనకు సంబంధించిన వ్రతం . ఆగష్టు 12 శ్రావణ శుద్ధ అష్టమి

దుర్గాదేవి పూజకు ఏడాది పొడవునా వచ్చే ప్రతి అష్టమీ అనుకూలమే. అయితే ఏడాది మొత్తం అష్టమిరోజు దుర్గమ్మను పూజించాలని సంకల్పిస్తే శ్రావణ శుద్ధ అష్టమి రోజు ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ప్రతి నెలా పూజిస్తారు.  

ఆగష్టు 13 శ్రావణ శుద్ధ నవమి

ఈ రోజు మంగళవారం రావడంతో..మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు.  ఆగష్టు 14 శ్రావణ శుద్ధ దశమి

శ్రావణ శుద్ధ దశమిని ఆశా దశమి అని పిలుస్తారు. ఈ రోజు చేసే పూజలు, వ్రతాల వల్ల కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం  ఆగష్టు 15  శ్రావణ శుద్ధ ఏకాదశి

దీనిని పుత్ర ఏకాదశిగా పిలుస్తారు. మహిజిత్తు అనే రాజు ఈ రోజు చేసిన వ్రత ఫలితంగా పుత్రుడు జన్మించాడట. అందుకే పుత్ర ఏకాదశి అంటారు 

Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!

ఆగష్టు 16 శ్రావణ శుద్ధ ద్వాదశి

ఈ రోజు శుక్రవారం..పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కావడంతో వివాహితులు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు

ఆగష్టు 17 శ్రావణ శుద్ధ త్రయోదశి

ఈ రోజు శనివారం కావడంతో..శని త్రయోదశి..శని ప్రభావంతో బాధపడేవారు ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు

ఆగష్టు 18 శ్రావణ శుద్ధ చతుర్దశి

చతుర్థశి రోజు పరమేశ్వరుడికి పవిత్రారోపణం చేస్తారు.  

ఆగస్టు 19-శ్రావణ పౌర్ణమి

ఈ రోజు రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. 

ఆగస్టు 20 శ్రావణ బహుళ  పాడ్యమి

ఈ రోజు మొదలు పెట్టిన ధనప్రాప్తి వ్రతం భాద్రపద పౌర్ణమి వరకూ చేస్తారు. 

ఆగస్టు 21 శ్రావణ బహుళ విదియ

ఈ రోజునే చాతుర్మాస్య ద్వితీయ అంటారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథి కూడా ఇదే. 

ఆగస్టు 22 శ్రావణ బహుళ తదియ - తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం

ఆగస్టు 23 శ్రావణ బహుళ చవితి - గోపూజ చేయాలి

ఆగస్టు 24 శ్రావణ బహుళ పంచమి - రక్షా పంచమి వ్రత దినమంటారు. 

ఆగస్టు 25 శ్రావణ బహుళ షష్ఠి -బలరామ జయంతి జరుపుకుంటారు

ఆగస్టు 26 శ్రావణ బహుళ అష్టమి -శ్రీకృష్ణ జన్మాష్టమిఈ రోజు శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం ఉట్లు కట్టి కొట్టే ఉత్సవం నిర్వహిస్తారు

ఆగస్టు 27 శ్రావణ బహుళ నవమిఈరోజు చండికా పూజ, కౌమారి పూజ, గోకులాష్టమి.. ఆగస్టు 27 శ్రావణ బహుళ ఏకాదశిఈ ఏకాదశిని గురు ఏకాదశి అంటారు.  

ఆగస్టు 31 శని త్రయోదశి సెప్టెంబరు 02- శ్రావణ అమావాస్యశ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య   జరుపుకుంటారు.  

సెప్టెంబరు 03 సూర్యోదయానికి అమావాస్య ఉండడం వల్ల రోజును కూడా శ్రావణమాస అమావాస్యగా పరిగణిస్తారు.

సెప్టెంబరు 04 నుంచి భాద్రపదమాసం ప్రారంభం అవుతుంది.