Sankatahara Chaturthi for July 2024: చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోయేందుకు గణపతిని పూజిస్తారు. వినాయకుడికి 32 స్వరూపాలు ఉన్నాయి. అందులో ఆఖరి స్వరూపం సంకష్ట హర చతుర్థి రోజు పూజించే రూపం. ఈ రూపంలో లంబోదరుడు కుడచేయి వరదహస్తం, ఎడమచేతిలో పాయసపాత్ర ఉంటుంది. సంకష్ట హర చతుర్థి ఏడాదికి 12 వస్తాయి. ప్రతి నెలా కృష్ణపక్షంలో వచ్చే ఏ చతుర్థి రోజు అయినా సంకష్ట హర చతుర్థి పూజ చేయవచ్చు. మొత్తం 12 నెలలు ఆచరిస్తే అత్యుత్తమ ఫలితాలు పొందుతారు..కనీసం ఒక్కనెలలో వచ్చే  సంకష్ట హర చతుర్థి రోజు వ్రతం ఆచిరించినా శుభఫలితాలు పొందుతారు.


జూలై నెలలో 24 బుధవారం సంకష్ట హర చతుర్థి వచ్చింది....


సంకష్ట హర చతుర్థి వ్రతం వల్ల ఉపయోగాలు


ప్రారంభించిన పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురైనప్పుడు  సంకష్ట హర చతుర్థి వ్రతం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి లేనప్పుడు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పనిసరిగా శుభఫలితం పొందుతారు. నరదృష్టితో బాధపడేవారు  దాన్నుంచి బయటపడేందుకు  సంకష్ట హర చతుర్థి వ్రతం చేస్తే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలున్నా, సంతానం లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ లేకపోయినా, శత్రుభయం వెంటాడుతున్నా..వివాహం జరగకపోయినా, చేయని తప్పులకు ఫలితం అనుభవిస్తున్నా.... సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించడం అత్యుత్తమం. 


Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!


సంకష్ట హర చతుర్థి వ్రతం ఎలా చేయాలి?


ఏ తిథి అయినా సూర్యోదయానికి ఉండేలా చూసుకుంటాం...కానీ..సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించాలంటే తిథి చంద్రోదయ సమయానికి ఉండాలి..అంటే సూర్యూస్తమయం సమయానికి చవితి తిథి ఉండాలి. ఈ వ్రతం ఆచరించాలి అనుకుంటే..సూర్యోదయానికి ముంందే స్నానమాచరించాలి. నీటిలో నల్లటి నువ్వులు వేసి స్నానమాచరించి.. ఏ కష్టం నుంచి బయటపడాలి అనుకుంటున్నారో, ఏ సమస్య తీరాలని సంకష్ట హర చతుర్థి వ్రతం చేస్తున్నారో మనసులో తలుచుకుని వినాయకుడికి ముడుపు కట్టాలి..


ముడుపు ఎలా కట్టాలి?


ఎరుపురంగు వస్త్రంలో పసుపు కుంకుమ వేసి... మూడు దోసిళ్ల బియ్యం, వక్కలు , ఎండు ఖర్చజూరాలు, దక్షిణ, తాంబూలం వేసి ఆ వస్త్రాన్ని ముడివేసి వినాయకుడి దగ్గర పెట్టాలి. గణపయ్యకి 21 సార్లు ప్రదక్షిణ చేసి మీ మనసులో కోర్కె మనస్ఫూర్తిగా భక్తితో  చెప్పుకోండి. అనంతరం వ్రతం ఎలాంటి విఘ్నాలు లేకుండా సవ్యంగా సాగాలని నమస్కరించండి.


వ్రత నియమాలు


ఏ వ్రతం ఆచరించినా ఉపవాసం ప్రధానం...అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాలు , పండ్లు తీసుకోవచ్చు. రోజంతా మౌనంగా ఉండాలి...మౌనవ్రతం అంటే ఏకంగా మాట్లాడకుండా ఉండిపోవడం కాదు..అనవసరమైనవి మాట్లాడకుండా ఉండడం అని అర్థం. బ్రహ్మచర్యం పాటించాలి. మద్యం,మాంసం ముట్టుకోరాదు. దాన ధర్మాలు ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించిన మర్నాడు అవకాశం ఉంటే గణపతి హోమం నిర్వహిస్తే ఇంకా మంచిది. అవకాశం లేకపోతే దీపారాధన చేసి వినాయకుడికి నమస్కరించుకుంటే చాలు. 


Also Read: జూలై 23 రాశిఫలాలు - ఈ రాశులవారు అనవసర విషయాలపై శ్రద్ధ తగ్గించుకోవడం మంచిది!


సంకష్ట హర చతుర్థి వ్రత విధానం


సాధారణంగా ఏ పూజలో అయినా అచమనం, సంకల్పం, కలశారాధన చేస్తారు. అనంతరం సంకష్టహర గణపతి షోడసోపచార పూజ చేయాలి.   అంగపూజ, ఏకవింశతి పుష్పపూజ ( 21 రకాల పుష్పాలు లేదంటే 21 పుష్పాలు), ఏకవింశతి పత్రి పూజ ( ఏవీ దొరక్కపోతే ఓన్లీ గరికతో చేయండి), వినాయకుడి అష్టోత్తరం, సంకట నాశన గణేష స్తోత్రం ,  గౌరీపూజ చేయాలి , పంచోపచార పూజ చేయాలి..ధూపం, దీపం నైవేద్యం అన్నీ సమర్పించాలి. ఆ తర్వాత దూర్వాయుగ్మ పూజ ( గరికెతో పూజ) పూర్తిచేసి...వ్రతకథలు చదువుకోవాలి.