Capricorn Yearly Horoscope 2025 in Telugu: ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న బృహస్పతి 2025 ఏప్రిల్ నుంచి రాశి మారుతుంది. అంటే మకర రాశి నుంచి ఆరో స్థానంలో గురుడి సంచారం ఉంటుంది. ఇక శనిదేవుడు కుంభం నుంచి మీన రాశిలోకి మారిన తర్వాత మకరం నుంచి మూడో స్థానంలో సంచరిస్తుంది. రాహువు రెండో స్థానంలో, కేతువు ఎనిమిదో స్థానంలో ఉంటాయి. ఈ ప్రభావంతో 2025 మొత్తం మకర రాశివారికి ఆరంభం అనుకూలంగా ఉంటుంది.. ఆ తర్వాత ఏడాది చివరి వరకూ మిశ్రమ ఫలితాలుంటాయి.
2025 లో ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారం విస్తరిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు.
2025 లో రాజకీయ నాయకులకు ఒత్తిడి పెరుగుతుంది. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు పొందుతారు..తగాదాలకు దూరంగా ఉండాలి
మీడియా, సినీ రంగాల్లో ఉండేవారు వృద్ధి చెందుతారు
Also Read: 2025లో ధనుస్సు రాశి వారికి అష్టమ శనితో చికాకులు..బృహస్పతి సంచారంతో ఉపశమనం!
జనవరి 2025
జనవరిలో మకర రాశివారికి అధిక ఖర్చులు ఉంటాయి కానీ మిగిలిన అన్ని విషయాలు అనుకూల ఫలితాలనే ఇస్తాయి. నూతన వస్తువు, వస్త్ర ప్రాప్తి ఉంటుంది. కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.
ఫిబ్రవరి 2025
ఈ నెల అన్ని రంగాల్లో ఉండేవారికి అనుకూల ఫలితాలను ఇస్తోంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. అప్పులు చేస్తారు. శుభకార్యాలు నిర్వహించాలి అనుకున్నా సమయం కలసిరాదు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
మార్చి 2025
ఈ నెల మీకు అనూకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. అన్నింటా మీదే పైచేయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికవృద్ధి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.
ఏప్రిల్ 2025
ఏప్రిల్ మీకు కొంత గందరగోళంగా ఉంటుంది. కుటుంబలో , కార్యాలయంలో వివాదాలుంటాయి. అనవసర ఆలోచనలు వస్తాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!
మే 2025
ఈ నెల నుంచి మీకు మంచి ఫలితాలు మొదలవుతాయి. శని కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించడంతో మీకు కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దాన ధర్మాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన ప్రయత్నాలు కలిసొస్తాయి.
జూన్ 2025
జూన్ నెలలో మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీపై మీకు నమ్మకం లేకపోవడంతో కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరినీ అతిగా నమ్మొద్దు.
జూలై 2025
ఈ నెలలో అన్నింటా విజయం మీ సొంతం. ఆస్తులు కొనుగోలు అమ్మకాల్లో విజయం సాధిస్తారు. వ్యవసానాలకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. నూతన గృహం కొనుగోలు దిశగా అడుగువేస్తారు.
Also Read: అదృష్టం - దురదృష్టం.. 2025లో తులా రాశి వారు ఏవైపు తూగుతున్నారు!
ఆగస్టు 2025
ఈ నెలలో ఉద్యోగం, వ్యాపారం, కుటుంబంలో అన్నింటా సంతోషమే. శత్రువులు మిత్రులుగా మారుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. రాజకీయనాయకులకు శుభసమయం.
సెప్టెంబర్ 2025
సెప్టెంబర్లో వ్యాపారులు, ఉద్యోగులకు శుభఫలితాలున్నాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి.
అక్టోబర్ 2025
ఈ నెలలో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి కానీ స్నేహితుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.
నవంబర్ 2025
నవంబర్ లో మకర రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది
డిసెంబర్ 2025
ఈ నెలలో మకర రాశివారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. అప్పులు తీరుతాయి కానీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది
Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.