Seethe Ramudi Katnam Serial Today Episode షాప్ ఓపెన్ చేయిస్తున్నందుకు సీత రామ్‌కి థ్యాంక్స్ చెప్తుంది. రామ్ ఇంత సాయం చేశా కదా ఏమైనా ఉందా అని అడుగుతాడు. దాంతో సీత ఉంది అని రొమాంటిక్‌గా రామ్ పక్కనకు వెళ్లి చేతి మీద గిచ్చేస్తుంది. ఇక రామ్ సీతని పట్టుకొని ముద్దు పెట్టే టైంకి సీత పారిపోతుంది. మహాలక్ష్మీ ఇంట్లో జరిగిన రచ్చ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఏంటి మహా ఇలా జరిగింది అని అర్చన వస్తుంది.
మహాలక్ష్మీ: సుమతిని ఇంటి నుంచి పంపేయాలి అనుకున్న ఏ ఒక్క ప్లాన్ సక్సెస్ అవ్వడం లేదు. బోనస్‌గా రామ్ సీత వైపే మాట్లాడుతున్నాడు. సదా నన్ను తప్పు పడుతున్నాడు.
అర్చన: నీ టైం బాలేదో లేక నీ ఐడియాలు బాలేవు అనుకున్నావో అర్థం కావడం లేదు.
మహాలక్ష్మీ: ఈ సారి చిన్నా చితక ప్లాన్స్ వేయకూడదు బ్రహ్మాస్త్రం వేయాలి. నువ్వు భయపడినట్లే ఈ సారి ప్లాన్ భయంకరంగా ఉంటుంది. ఈసారి భయంతో సుమతి ఏకంగా జైలుకే వెళ్తుంది. ఈ కథకి ఇదే క్లైమాక్స్ సీతకి లైఫ్ టైం షాక్. వెంటనే మనం ఒక పని చేయాలి పద చెప్తాను.
విద్యాదేవి అలియాస్ సుమతి కిందకి వస్తుంటే హాల్‌లో రామ్, సీతల ఫొటో ఊగుతూ కింద పడే టైంకి టీచర్ పట్టుకుంటుంది. దాంతో విద్యాదేవి చేతికి మేకు గుచ్చి రక్తం వస్తుంది. అది చూసిన సీత ఏంటి అత్తమ్మ ఇలా చేశారు అని ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఫొటో పడిన, చీర కాలిపోయిన ఏం కాదులే అత్తమ్మ దీపాలు ఉదయం వరకు వెలుగుతూనే ఉన్నాయి అంటే మా బంధం ఎంత బలమైందో అర్థమవుతుంది కదా అత్తమ్మ ఇలాంటివి పట్టించుకోవద్దని అంటుంది. దాంతో విద్యాదేవి దీపం ఆరిపోయిన సీన్ గుర్తు చేసుకుంటుంది. సీత టీచర్‌కి జాగ్రత్తలు చెప్తుంది. ఏం జరుగుతుందో భయంగా ఉందని టీచర్ అనుకుంటుంది. ఇక మహాలక్ష్మీ బయట విద్యాదేవి కూర్చొని ఉంటే అక్కడికి వెళ్తుంది.
మహాలక్ష్మీ: నీ గురించి అందరికీ తెలియాలి అని నేను ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా ఆ సీత వల్ల అవన్నీ వర్కౌట్ అవ్వడం లేదు. నేను పడిపోయే పరిస్థితే వస్తే నాకు అడ్డు వచ్చిన వారి ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని నీకు తెలుసు.
విద్యాదేవి: ఇంకెంత మందిని చంపుతావు మహాలక్ష్మీ. ఇంకెన్ని హత్యలు చేస్తావు.
మహాలక్ష్మీ: నా శత్రువులు నువ్వు సీత మాత్రమే. నిన్ను ఆల్రెడీ చంపేశా నువ్వు బతికున్న శవం మాత్రమే ఇప్పుడు ఆ సీతని చంపేస్తే నువ్వు పూర్తిగా చచ్చిపోతావ్. ( మహాలక్ష్మీ వీడియో తీయమని అర్చనకు సైగ చేస్తుంది)
విద్యాదేవి: సీత జోలికి వెళ్లకు మహాలక్ష్మీ నా సంగతి కూడా నీకు బాగా తెలుసు.
మహాలక్ష్మీ: మీరు డ్యాన్స్ టీచర్ అని నాకు బాగా తెలుసు. సుమతిని చంపిన హంతకురాలు అని కూడా నాకు తెలుసు.
విద్యాదేవి: నీ వల్ల సీతకు ఎలాంటి అన్యాయం జరిగినా క్షమించను మహాలక్ష్మీ.
మహాలక్ష్మీ: సీత మీద మీకు అంత ప్రేమ ఎందుకు మీతో కలిసి ఉంటే సీతకి శిక్ష పడుతుంది.
విద్యాదేవి: సీతని శిక్షించడానికి నువ్వు ఎవరు. సీతకి నీ వల్ల చిన్న గాటు పడినా చంపేస్తా. నీ వల్ల ఒక సారి జైలుకి వెళ్లి వచ్చాను నిన్ను చంపి మరోసారి జైలుకి వెళ్లడానికి రెడీగా ఉన్నా నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది గుర్తు పెట్టుకో.
టీచర్ వెళ్లిపోతే అర్చన వీడియో మహాలక్ష్మీకి చూపిస్తుంది. నన్ను చంపేస్తుంది అన్న మాటను వాడుకొని సుమతిని ఇబ్బంది పెడతానని మహాలక్ష్మీ అనుకుంటుంది. ఈ సారి భారీ స్కెచ్‌కి ఇద్దరూ అత్తాకోడళ్లు అల్లాడిపోవడం ఖాయం అని మహాలక్ష్మీ అనుకుంటుంది. ఇక సీత అందరికీ ఫోన్ చేసి షాప్ ఓపెన్ చేస్తున్నామని చెప్తుంది. రామ్ చూసి కొత్త నెంబరుతో సీతకి కాల్ చేసి లేడీ గొంతుతో మాట్లాడుతాడు. రామ్ కోసం వస్తుంటా అని రామ్ చాలా బాగుంటారు అని రామ్ని హగ్ చేసుకోవాలి ముద్దు పెట్టాలి అనిపిస్తుందని మాట్లాడుతాడు. మా ఆయన గురించి మాట్లాడుతున్నావ్ అని సీత ఫైర్ అయిపోతుంది. రామ్ మాటలు విద్యాదేవి విని నవ్వుకుంటుంది. సీతని చాటుగా పిలుస్తుంది. రామ్‌నే మాట్లాడుతుందని టీచర్ సీతకి సైగ చేసి చూపిస్తుంది. రామ్ సీతతో నీకు రెండు కోట్లు ఇస్తా నీ భర్తని ఇచ్చేయ్ అంటే ఇవ్వు నీ వెనకే ఉన్నాను అంటుంది. రామ్ సీతని చూసి నవ్వుకుంటాడు. సీత రామ్ వెంట కర్ర పట్టుకొని వెంటపడుతుంది. ఆ జంటని చూసి టీచర్ మురిసిపోతుంది. మహాలక్ష్మీ పోలీస్ తిలక్‌ని కలుస్తుంది. మరోప్లాన్ చేస్తున్నా హెల్ప్ చేయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత పని చేశావ్ జ్యో.. కూలీగా దీప కంటపడ్డ కార్తీక్.. ఇది మామూలు షాక్ కాదుగా!