Love Horoscope Today 1st December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రాశి వివాహితులైనా, ప్రేమికుల మధ్యనైనా అపనమ్మకం సరికాదు.ఒకరిపై మరొకరికి పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడం మీ బంధంలో చీలకను తెస్తుంది. ఏదో పరధ్యానంలో ఉండిపోతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగిస్తుంది
వృషభ రాశి
కొన్ని కారణాల వల్ల మీరు మీ భాగస్వామిని శత్రువుగా చూస్తారు. అయినప్పటికీ వారినుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. ప్రేమికులకు మంచి రోజు కాదు. పరస్పర విభేదాలకు దూరంగా ఉండేలా చూసుకోండి
మిథున రాశి
ఈ రాశి ప్రేమికులు నిశ్చితార్థానికి సిద్ధమవుతారు. ఉద్యోగులు సహోద్యోగినే జీవిత భాగస్వామిగా చేసుకునే అవకాశం ఉంది. కోరుకున్న వారిని జీవితంలోకి ఆహ్వానించాలన్న కోరిక నెరవేరుతుంది
కర్కాటక రాశి
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కానీ వారి అనారోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావొచ్చు. ప్రత్యేకమైన బహుమతితో అలక తీర్చడంలో సక్సెస్ అవుతారు. భాగస్వామితో శృంగార యాత్రకు వెళ్లవచ్చు. ఈరోజు రొమాన్స్‌తో నిండి ఉంటుంది.
Also Read: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!
సింహ రాశి
కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరితో గొడవలు ఉండొచ్చు..ఈ ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై పడుతుంది. ప్రేమికుల మనసెరిగి ప్రవర్తించండి. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుంటే మీ మధ్య దూరం పెరుగుతుంది.
కన్యా రాశి
మీ ఇద్దరి ఆలోచనావిధానం ఒకరిపై మరొకరికి ప్రేమను పెంచుతుంది...అదే సమయంలో దూరం కూడా పెరిగే అవకాశం ఉంది. పని ప్రదేశంలో తెలియని భాగస్వామితో స్నేహం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
తులా రాశి
ఆర్థిక సమస్యలు మీ ప్రియమైనవారినుంచి దూరంగా ఉంచుతాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఉత్తమమైన రోజు. అయితే తల్లిదండ్రులను ఒప్పించవలసి రావచ్చు.
వృశ్చిక రాశి
ఎలాంటి నిర్దిష్ట కారణం లేకుండా భాగస్వామి నుంచి దూరం అవుతారు.అనవసరమైన కోపం పరస్పర ప్రేమను తగ్గిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రేమ జీవితంలో పరస్పర అపార్థాలు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
మీకు పరిస్థితి అంతం అనుకూలంగా లేదు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. ప్రియమైన వారిని అర్థంచేసుకుని ప్రేమగా దగ్గరయ్యేలా చూసుకోవాలి. ఆసక్తికరమైన చర్చలతో పరస్పర టెన్షన్‌ని తొలగించుకోండి.
Also Read: ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు
మకర రాశి
అవివాహితుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటినుంచో దూరంగా ఉన్న ప్రేమికులు ఈ రోజు కలుస్తారు. కుటుంబ విషయాలపై జీవిత భాగస్వామితో పరస్పర చర్చలు జరుగుతాయి.
కుంభ రాశి
మనసంతా గందరగోళంగా ఉంటుంది. పాత స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. భాగస్వామి కోసం సమయం కేటాయిస్తే మీ చింతలన్నీ తొలగిపోతాయి. కాసేపు బయటకు వెళ్లి రావడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.
మీన రాశి
మీ జీవిత భాగస్వామితో అనవసర వివాదాలను నివారించండి. ప్రేమ జీవితంలో భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈ రోజు ప్రేమికులు ఏదో విషయంలో గందరగోళానికి గురవుతాడు.