ఏదైనా గుడికి వెళ్లినప్పుడు ఆలయాల బయట రంగురంగుల దారాలు అమ్ముతుంటారు. అక్కడి నుంచి ఇంటికొచ్చాక చుట్టుపక్కల అందరికీ ప్రసాదం పాటూ దారాలు కూడా ఇస్తారు కొందరు. చేతికి దారాలు కట్టుకోవాలనే సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది. చేతికున్న దారం పాడైపోతే వెంటనే మార్చేసుకుంటారు కానీ చేయి మాత్రం ఖాళీగా ఉంచుకోరు. వాటిని కంకణంగా భావిస్తారు. అయితే పసుపు, నారింజ, ఎరుపు..ఈ రంగుల్లోనే ఉంటాయి..వీటిని మౌళి దారాలు అంటారు.. వీటిని కంకణంగా ఎందుకు ధరిస్తారో తెలుసుకోవాలంటే ముందు బలిచక్రవర్తి కథ తెలుసుకోవాలి...


Also Read: పడకగది పనులు కూడా బహిరంగం.. కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణక్యుడు


బలి చక్రవర్తికి మౌళి దారాలకు ఏంటి సంబంధం
బలి చక్రవర్తిని అంతమొందించేందుకు శ్రీ‌మ‌హావిష్ణువు వామన అవతారం ఎత్తాడన్న విషయం  చాలామందికి తెలుసు. బలి అసురుడే అయినా దానలు చేయడంలో చాలా గొప్పవాడు. బ‌లి చ‌క్ర‌వ‌ర్తి తన వ‌ద్ద‌కు వచ్చిన వామనుడున్ని చూసి ఏం కావాలో కోరకోమంటాడు. దానికి వామనుడు మూడ‌డుగుల స్థలం కావాల‌ని అడుగుతాడు. వామ‌నుడు ఓ అడుగు భూమిపై, మ‌రో అడుగుపై ఆకాశంపై పెడ‌తాడు. ఇక మూడో అడుగు ఎక్క‌డ పెట్టాలి అని వామ‌నుడు అడిగితే అప్పుడు బ‌లి ఏ మాత్రం సందేహించ‌కుండా త‌న తలపై పెట్ట‌మంటాడు. దీంతో వామ‌నుడు త‌న కాలిని బ‌లి నెత్తిన పెట్ట‌గానే అత‌ను పాతాళంలోకి వెళ్లిపోతాడు. బ‌లి దాన గుణానికి మెచ్చిన‌ వామ‌నుడు బ‌లికి మృత్యుంజ‌యుడిగా ఉండేలా వ‌రం ఇస్తూ పైన చెప్పిన మౌళి దారాన్ని క‌డ‌తాడ‌ట‌. అప్పటి నుంచీ ఈ దారం చేతికి కడుతూ వస్తున్నారని చెబుతారు. మౌళి దారం క‌డితే ఎలాంటి కీడు జరగదని, మృత్యు భయం ఉండదని నమ్మకం


ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులే ఎందుకు
ఎరుపు, పసుపు, నారింజ రంగుల దారాలు కలగలిపి ఉండే ఈ మౌళి దారం కట్టుకోవడం వలన గ్రహపీడలు తొలగి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. ఈ మూడు రంగులు బుధుడు, కుజుడు, సూర్యుడిని ప్రతిబింబిస్తాయని.. ఈ దారాన్ని ధరిస్తే గ్రహపీడల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతుంటారు. బుధుడు, కుజుడు,సూర్యుడు.. ఐశ్వ‌ర్యానికి, విద్య‌కు, ఆరోగ్యానికి కార‌కుల‌ు. అందుకే మౌళిదారం కట్టుకుంటే అంతా మంచి జరుగుతుందంటారు.  నలుపు దారాన్ని చాలామంది ఇష్టపడి మరీ కట్టించుకుంటూ ఉంటారు. ఎలాంటి చెడు ప్రభావం మీద ఉండకూడదని, ఎవరి చూపు వల్ల మనకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నలుపు దారాన్ని చేతికి లేదంటే కాలికి కట్టుకుంటారు. మరికొందరైతే ఫ్యాషన్ కోసం కూడా కట్టుకుంటున్నారు. నల్లదారానికి పూసలు జోడించి మరీ కట్టేవారు కూడా ఉన్నారు. అయితే నల్లతాడు కొన్ని రాశులవారికి మేలు చేస్తే మరికొన్ని రాశులవారికి కీడు చేస్తుందట..అది తెలుసుకుని కట్టుకోవడం మంచిది


Also Read: ఈ రెండు రాశుల వారు కాలికి నల్లదారం కట్టుకోకూడదు, ఆ మూడు రాశులవారికి ఐశ్వర్యం-ఆనందం


నోట్: కొందరు పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా రాసిన విషయాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలాన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి