Lakshmi Narayana Yogam: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన స్థానాన్ని మారుతూ ఉంటుంది. వీటి మార్పు వల్ల మన జీవితాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ గ్రహాల గమనం వల్ల, ఇతర గ్రహాలతో సంచారం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. శుభమైనా, అశుభమైనా దాని ప్రభావం మనిషి జీవితంపై ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 26 బుధవారం ప్రత్యేక యోగం ఉంటుంది.అదే లక్ష్మీనారాయణ యోగం. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీని ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. మరోవైపు అక్టోబరు 18 నుంచి శుక్రుడు తులారాశిలో సంచరిస్తుండగా.. అక్టోబరు 26న బుధుడు కూడా తులారాశిలో ప్రవేశిస్తాడు. శుక్రుడు -బుధుడు కలయికతో లక్ష్మీణారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి.
కన్యా రాశి
లక్ష్మీ నారాయణ యోగం వల్ల కన్యా రాశి వారికి విశేష ప్రయోజనాలున్నాయి. ఈ యోగం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరుతాయి. దీనితో పాటు నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా మరో మెట్టెక్కుతారు. కెరీర్ మెరుగుపడుతుంది. చేసే పనికి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు. పనిలో విజయం పొందుతారు. మీకు సీనియర్ల మద్దతు లభిస్తుంది.
Also Read: దీపావళికి చీపురు కొంటే సిరిసంపదలని ఎందుకు చెబుతారంటే!
ధనుస్సు రాశి
లక్ష్మీ-నారాయణ యోగం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రానిబాకీలు వసూలవుతాయి, పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి ఇదే శుభసమయం. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మకరరాశి
లక్ష్మీ-నారాయణ యోగం మకరరాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. వ్యాపారం పుంజుకుంటుంది. కుటుంబంలో పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది.
Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!
బుధుడు, శుక్రుడు కలయికతో ఏర్పడింది ఈ లక్ష్మీ నారాయణ యోగం
- జ్యోతిషశాస్త్రంలో బుధుడు తెలివితేటలు, వాణిజ్యానికి శుక్రుడు విలాసవంతమైన జీవితానికి కారకంగా పరిగణిస్తారు.
- ఈ యోగం ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి తన తెలివితేటలు, ప్రతిభతో జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతాడు.
- వారి జీవితంలో డబ్బుకు లోటుండదు. ఆదాయవనరులు పెరుగుతాయి.
- బుధుడు, శుక్రుడు ఏర్పడిన ఈ యోగం వల్ల మనిషి జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తాడు.
- బుధుడు, శుక్రుడితో పాటూ దేవ గురువు బృహస్పతి కూడా తోడైతే అజ్ఞాని కూడా జ్ఞానంతో ప్రకాశిస్తాడు