Diwali 2022:  ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళిని నిర్వహించుకుంటారు. చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి నిర్వహించుకోవడం ప్రతీతి. ఈరోజున లక్ష్మీపూజ చేస్తే సిరిసంపదలు కలిసొస్తాయని నమ్మకం. అలాగే మరో నమ్మకం కూడా ప్రజల్లో ఉండిపోయింది. అదేంటంటే దీపావళి రోజు కొత్త చీపురు కొనడం. దీపావళికి కొత్త చీపురు కొంటే ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటామని విశ్వాసం.


సాధారణంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు హిందూ ఆచారంలో. అందుకే దీపావళి రోజున చీపురు కొంటారు. కొత్త చీపురు కొని ఇంటికి తీసుకొచ్చామంటే సాక్షాత్తూ లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకొచ్చినట్టేనని భావిస్తారు. ఇంటికి తీసుకొచ్చిన కొత్త చీపురుకు పూజ చేసి ఆ తర్వాత రోజునుంచి ఉపయోగించడం మొదలుపెడతారు. ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీ దేవి చీపురులో నివసిస్తుందని, కాబట్టి దీపావళి రోజున లక్ష్మి శాశ్వతంగా నివసించే చీపురును ఆలయంలో శుభ ముహూర్తంలో దానం చేయాలని చెబుతారు.


Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!


దీపావళి మాత్రమే కాకుండా ఏ రోజైనా చీపురు కొనుక్కోవచ్చు కానీ శనివారం చీపురు కొనకూడదని చెబుతారు. ఇక బహిరంగ ప్రదేశంలో చీపురు ఉంచడం అశుభం అని పెద్దలు చెబుతారు. ఇంటి ప్రధాన ద్వారం నుంచి చీపురును ఎవరూ చూడకూడకుండా పెట్టాలట. వినయోగించని చీపుర్లు కళ్లముందు ఉంచుకోరాదు. ముఖ్యంగా చీపురు ఉత్తరంవైపు ఉంచాలంటారు వాస్తు నిపుణులు. పూజ గదిలో, పడక గదిలో చీపురు ఎప్పుడూ ఉంచకూడదు. పడక గదిలో చీపురు ఉంచినట్లయితే  వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయంటారు. చీరుపును పాదాలతో తాకడం,దాంతో ఎవరినైనా కొట్టడం, నిర్లక్ష్యంగా విసిరి కొట్టడం అస్సలు చేయకూడదు 


చీపురును దీపావళి పండుగ రోజు కొని తెచ్చుకుంటే సిరిసంపదలు పెరుగుతాయంటారు కాబట్టి కొత్త చీపురు కొని తెచ్చుకోండి. అన్నట్టు పండితులు చెప్పిన ప్రకారం చీపురును దానం చేసినా కూడా చాలా మంచిది. హిందూమత ఆచారాలకు విలువ ఇచ్చే వారంతా దీపావళి రోజున చీపురును కూడా పవిత్రంగా చూడాలి అని చెబుతున్నారు పండితులు. 


Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!


శ్రీ మహాలక్ష్మి అష్టకం
ఇంద్ర ఉవాచ 
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || 1 ||


నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 2 ||


సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 3 ||


సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 4 ||


ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే || 5 ||


స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 6 ||


పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || 7 ||


శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే || 8 ||


మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||


ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||


త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||


ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్