తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్‌ 2022-23 కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ అక్టోబరు 17న విడుదలైంది. దీని ప్రకారం అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. అక్టోబరు 26 నుంచి 28 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం అక్టోబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబరు 28 నుంచి 30 వరకు ఫేజ్‌-1 వెబ్‌ ఆప్షన్ల నమోదు,  అక్టోబరు 31న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌‌కు అవకాశం కల్పించనున్నారు. నవంబర్‌ 4న ఎంపికైన అభ్యర్థుల జాబితాను కాలేజీల వారిగా ప్రకటిస్తారు. నవంబరు 14 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి. 

షెడ్యూల్ ఇదే...
✈ అక్టోబర్ 17వ తేదీన కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ జారీ
✈ అక్టోబర్ 18 - 26 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన.
✈ అక్టోబర్ 28 - 30 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు -
✈ నవంబరు 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు.
✈ నవంబర్ 5 - 11వ తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26న టీఎస్‌ఎడ్‌సెట్-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26న ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,578 మంది హాజరుకాగా.. 30,580 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన అభిషేక్‌ మోహంతికి మొదటి ర్యాంక్‌ సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు రెండో ర్యాంక్‌ సాధించాడు. మేడ్చల్‌కు చెందిన ముకేష్‌కు మూడో ర్యాంక్‌, జనగామకు చెందిన మహేష్‌ కుమార్‌కు 4వ ర్యాంక్‌, మేడ్చల్‌కు చెందిన అర్హద్‌ అహ్మద్‌ ఐదో ర్యాంక్‌ దక్కించుకన్నాడు. ఎడ్‌సెట్‌ ర్యాంక్‌ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహించింది.


 


ఇవీ చదవండి..


బీసీ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో 15 కొత్త బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గడువును అక్టోబరు 20 వరకు పొడిగించినట్లు మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. ఇంటర్‌ మార్కు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. బీఎస్సీ బీజడ్‌సీ, ఎంపీసీ, కంప్యూటర్‌ సైన్స్‌, బీఏహెచ్‌ఈపీ కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బీబీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


TSPECET: టీఎస్‌పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్య తేదీలివే!
తెలంగాణలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి నవంబరు 2 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..



MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్‌ కోర్సు, పుస్తకాలు ఆవిష్కరించిన అమిత్‌ షా!

వైద్య విద్యను హిందీ మాధ్యమంలో కొనసాగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నంలో ముందడుగు పడింది. దేశ విద్యా వ్యవస్థలోనే చారిత్రక ఘట్టం మొదలైంది. తొలిసారిగా వైద్యవిద్యను హిందీ మాధ్యమంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ భోపాల్‌‌లో హిందీలో ఎంబీబీఎస్ కోర్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ మేరకు హిందీ మాధ్యమ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..