తెలంగాణలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి నవంబరు 2 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అక్టోబరు 29, 30న పీఈసెట్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. నవంబర్ 2న బీపీఈడీ, డీపీఈడీ అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. నవంబర్ 14న బీపీఈడీ, డీపీఈడీ తరగతులు ప్రారంభం కానున్నాయి.
టీఎస్‌పీఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు...
* అక్టోబరు 19 నుంచి 26 వరకు: ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన.
* అక్టోబరు 29, 30 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు.
* నవంబర్ 2న: బీపీఈడీ, డీపీఈడీ అభ్యర్థులకు సీట్లు కేటాయింపు.
* నవంబర్ 14న బీపీఈడీ, డీపీఈడీ తరగతులు ప్రారంభం
వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన టీఎస్ పీఈసెట్ ఫలితాలు ఇటీవల ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీడీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా 6 కేంద్రాల్లో సెప్టెంబరు 21న ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా 2,340 మంది హాజరయ్యారు. సెప్టెంబరు 21న ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు.
:: Read Also ::
TS NMMS: తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష డిసెంబరు 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 28 వరకు గడువు ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
AP NMMS: ఏపీ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
COVID Scholarships: కొవిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!!
ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం ‘కొవిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. తర్వాత వీరికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి, ఎంపికైనవారికి స్కాలర్‌షిప్ అందజేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..