Bigg Boss 6 Telugu: శనివారం అంటేనే నాగార్జున ఇంటి సభ్యులకు క్లాసులు పీకే రోజు అని అర్థం. అందుకే ఆ రోజు వచ్చిందంటే చాలు ఇంటి సభ్యుల గుండె గుభేలుమంటుంది. గత వీకెండ్లలో చాలా మంది ఇంటి సభ్యులకు నాగార్జున క్లాసు తీసుకున్నారు. ఈసారి క్లాసు ఎవరికి పడుతుందో అని ఆలోచిస్తున్నారా? ఇనయాకు నాగార్జున క్లాసు తీసుకున్నట్టే అర్థమవుతోంది. చాలా బాగా ఆడే ఇనయా సరిగ్గా ఆట ఆడడం మానేసి సూర్య చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. టాప్ 5లో ఉంటుందనుకున్న అమ్మాయి ఏ వారమైనా వెళ్లిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఆమె ఆట కరెక్టుగా ఆడితే షోకు కంటెంట్ కూడా అధికంగా వస్తుంది. అందుకు నాగార్జున ఇనయాతో ఈ వీకెండ్ మాట్లాడారు. ఈ మనసు ఆట మీద నుంచి మనుషుల మీదకు వెళ్లిందని అన్నారు. ఆమె ఏం సమాధానం చెప్పిందో ఎపిసోడ్లో చూడాలి. 


ఇంట్లో ఎవరు గుడ్?
ఇంట్లో ఎవరు గుడ్, ఎవరు డెడ్ అనే ఆట ఆడారు. ఇంట్లో ఎవరు బాగా ఆడితే వాళ్లు గుడ్ అని ఇచ్చారు. అలా శ్రీ సత్యను లేపి డెడ్ ఇచ్చారు. ఫైమా సంచాలక్‌గా కుండీల్లో కుండీ పెట్టడం ఫెయిర్ అనిపించడం లేదని చెప్పారు నాగార్జున. అప్పుడు రేవంత్ చాలా ఆనందపడ్డాడు. ఇక ఫైమాను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున ఏదైనా ఇంట్రెస్ట్ థింగ్ చెప్పాలి అని అడిగారు. దానికి ఫైమా ‘ఇనయా, సూర్యల మధ్య ఏదో జరుగుతోంది సర్’ అని చెప్పింది. దానికి నాగార్జున ఏం జరుగుతోంది అని అడిగేసరికి ఏం చెప్పలేక బయటికి వెళ్లిపోయింది ఫైమా. 



ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది నిలిచారు. 
1. ఆదిత్య
2. గీతూ
3. రాజ్ 
4. కీర్తి
5. సుదీప
6. ఆదిరెడ్డి
7. ఇనయా
8. శ్రీహాన్
9. అర్జున్






వీరిలో సుదీప బయటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమె ఆట ఆడడం లేదు. ఫిజికల్ టాస్కులు ఆడడం లేదు. దీని వల్లే ఆమె బయటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్, ఫైమాతో గొడవలు కూడా ఈమె ఎలిమినేషన్ కు కారణం కావచ్చు. 



Also read: ఆర్జే సూర్య, ఆరోహిలది స్నేహమే, ఇనయానే అతని వెంటపడుతోంది - గర్ల్ ఫ్రెండ్ బుజ్జిమా అభిప్రాయం