తెలంగాణలో ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. వీరికి అక్టోబరు 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన వారు అక్టోబరు 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి అక్టోబర్ 26న సీట్ల కేటాయింపు ఉంటుంది.
సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ సమయంలోనే ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబర్ 27న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత 14, 202 సీట్లు మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా 177 కళాశాలల్లో 78,336 కన్వీనర్ కోటా సీట్లుండగా.. రెండు విడతల్లో కలిపి 64,134 భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో 2,691 సీట్లు మిగిలాయి.
తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
* అక్టోబర్ 21: సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్.
* అక్టోబరు 22: సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ.
* అక్టోబరు 21 నుంచి 23 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు.
* అక్టోబర్ 26: సీట్ల కేటాయింపు.
* అక్టోబర్ 26 నుంచి 28 వరకు: ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్.
* అక్టోబర్ 27: స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశ వివరాల ప్రకటన.
మొదటి విడతలో..
ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ లో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల కోసం ఎక్కువ ఎంపిక చేసుకున్నారు. ఈ కోర్సుల్లోని 41,506 సీట్లు ఉండగా మెుదటి దశలో 40,878 సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 100 శాతం సీట్ల కేటాయింపులు జరిగాయి. అదేవిధంగా, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CSE (డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా 11 ఇతర కోర్సులు 90 శాతానికి పైగా సీట్లు కేటాయించారు.
రెండో విడతలో..
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు అక్టోబరు 16న సీట్లు కేటాయించారు. మొత్తం 21,136 మంది విద్యార్థులు కొత్తగా సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన 42,998 మంది కలిపి మొత్తం 64,134 మందికి సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 20 శాతం మంది వరకు కళాశాలలు, బ్రాంచీలు మారారని అధికారులు తెలిపారు. రెండో విడతలో 53,848 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో కొత్తగా 3,547 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. తగినన్ని ఆప్షన్లు ఇవ్వని 4,590 మందికి సీట్లు రాలేదు. మొత్తం కన్వీనర్ సీట్లలో 81.87% భర్తీ అయ్యాయి.
:: ఇవీ చదవండి ::
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ 2022-23 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అక్టోబరు 17న విడుదల కానుంది. తెలంగాణ ప్రవేశాల కమిటీ విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అక్టోబరు 26 నుంచి 28 వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం అక్టోబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
TSPECET: టీఎస్‌పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే!
తెలంగాణలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి నవంబరు 2 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి