Horoscope Today November 30, 2024
మేష రాశి
ఈ రోజు మీ ప్రతిభను నిరూపించుకునే రోజు. ఉద్యోగులు కార్యాలయంలో ముఖ్యమైన బాధ్యత పొందుతారు. వివాదాలు పరిష్కరించుకోవడంలో సక్సెస్ అవుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీరు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీ పనులకోసం ఇతరులపై ఆధారపడొద్దు. విద్యార్థులు మేధోపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు
మిథున రాశి
ఈ రోజు మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మరోసారి ఆలోచించండి. ఏదైనా ప్రభుత్వ పనితో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాలను పొందుతారు.
కార్కాటక రాశి
ఈ రోజు మీకు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్లయితే దాన్ని పరిష్కరించుకోవడానికి అనుభవజ్ఞులైన వ్యక్తులతో మాట్లాడడం మంచింది. కుటుంబ విషయాలను పెద్దలతో చర్చించినప్పుడే పరిష్కారం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామి సహకారంతో సమస్యలు అధిగమిస్తారు.
Also Read: వక్రం నుంచి సాధారణ స్థితిలోకి బుధుడు - ఇయర్ ఎండ్ ఈ 4 రాశులవారికి అదిరిపోతుంది!
సింహ రాశి
ఈ రోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అనుకున్న పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. మీరు మీ కుటుంబ సభ్యులలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురికావొద్దు.
కన్యా రాశి
మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఏదైనా టెన్షన్ ఉంటే ఈ రోజు మీకు అది దూరమవుతుంది. మీరు చేసే వాగ్ధానాల విషయంలో ఆలోచనాత్మకంగా ఉండాలి. రాజకీయాలవైపు వెళ్లాని అనుకునే వారికి ఇదే మంచిసమయం. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు.
తులా రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.
Also Read: గీతాజయంతి, ధనుస్సంక్రాంతి సహా 2024 డిసెంబర్ లో పండుగల జాబితా ఇదే!
వృశ్చిక రాశి
ఈ రోజు బాధ్యతాయుతంగా పనులు చేయాల్సిన రోజు. మీ పనితీరుపై ఉండే ఫిర్యాదులు తొలగిపోతాయి. ఉద్యోగులు మీ పనిని మరొకరిపై రుద్దొద్దు. ఏదైనా పని విషయంలో టెన్షన్ ఉంటే తీరిపోతుంది. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు.
ధనస్సు రాశి
ఏ విషయంలోనూ అజాగ్రత్తగా వ్యవహరించొద్దు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసేస్తారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది
మకర రాశి
ఈ రోజు మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా మీపై గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వెనక్కి తగ్గొద్దు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు.
కుంభ రాశి
చాలా తెలివిగా ఆలోచిస్తారు..పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. ఇతరుల గురించి అనవసరంగా మాట్లాడొద్దు. వ్యాపారంలో భాగంగా అప్పులు చేయొద్దు. ఈ రోజు మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబానికి సమయం కేటాయించండి..చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
Also Read: 2024 ఈ రాశులవారికి హ్యాపీ ఎండింగ్.. డిసెంబర్ మాస ఫలాలు!
మీన రాశి
ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు. మీ మాటలో మాధుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారానికి సంబంధించి ఏదైనా పెండింగ్ పనులుంటే పూర్తవుతాయి. వృత్తిపరమైన ఆందోళనలు దూరమవుతాయి. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.