Horoscope Today 16th January  2024  - జనవరి 16 రాశిఫలాలు


మేష రాశి (Aries Horoscope Today) 


మీ వృత్తి జీవితంలో కొత్త విజయాలు ఉండవచ్చు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఏ పని ప్రారంభించినా పూర్తి చేసేవరకూ విశ్రమించవద్దు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారంలో లాభాలు పొందారు. ఆర్థికస్థితి బలోపేతం అవుతుంది. 


వృషభ రాశి (Taurus  Horoscope Today)


ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు .. జాగ్రత్త. నిర్దిష్ట పనికి సంబంధించిన ప్రయాణం ప్రయోజనకరంగా ఉండవచ్చు.  మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలు చర్చించండి. 


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 


మిథున రాశి (Gemini Horoscope Today) 


ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వ్యాపారంలో రిస్క్ తీసుకున్నట్టైతే కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రయోజనం ఉంటుంది. పిల్లలతో సమయం స్పెండ్ చేయండి.  ఉద్యోగులకు మిశ్రమ సమయం. 


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


కర్కాటక రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందిస్తారు. వృత్తిపరమైన రంగంలో ఏదైనా పని పెండింగ్‌లో ఉంటే అది పూర్తి కావచ్చు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. అవివాహిత వ్యక్తులకు వివాహం నిశ్చయమవుతుంది. 


Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!


సింహ రాశి (Leo Horoscope Today)


సింహరాశి వారికి ఈ రోజు వ్యాపారంలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రయాణం చేయాలనుకుంటే జాగ్రత్త.  వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది.  


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


కన్యా రాశి వారు ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి జాగ్రత్త. వ్యాపారంలో నూతన ఒప్పందాలు ఖరారవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా  వ్యవహరించవద్దు. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలకు విలువనిస్తారు.  బయటి వ్యక్తులతో ఏదైనా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.


తులా రాశి (Libra Horoscope Today) 


తులారాశివారి గౌరవం పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో కలిసొస్తుంది. కుటుంబంలో ఏదైనా గొడవలుంటే పరిష్కరించుకోవడం మంచిది. చాలాకాలం తర్వాత పాత స్నేహితులను కలవడం సంతోషంగా ఉంటుంది. అవివాహిత వ్యక్తులకు సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం బావుంటుంది. 


Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే!


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


వృశ్చికరాశివారు బిజీగా ఉంటుంది. ఇతరులకు వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ముఖ్యమైన లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించండి. కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఉద్యోగ రీత్యా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి వద్దనైనా అప్పుగా తీసుకున్నట్లయితే ఈ రోజు తిరిగి చెల్లించగలుగుతారు.


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


ఈ రాశివారికి వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.  ఒకరి వృత్తికి సంబంధించిన, వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది. ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాల కోసం దృష్టి సారించాలి. 


మకర రాశి (Capricorn Horoscope Today) 


 నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంటుంది. వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలనే ఆలోచన ఫలిస్తుంది. మీ సంబంధంలో విభేదాలుంటే అవి పరిష్కరించురునేందుకు మంచి సమయం ఇది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే తిరిగి చెల్లిస్తారు. కొన్ని వ్యాపార ప్రణాళికలు మంచి లాభాలను తెస్తాయి.


Also Read: కనుమ శుభాకాంక్షలు తెలియజేసేందుకు కొటేషన్స్!


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


కుంభరాశి వారికి గడిచిన రోజుల కన్నా ఈ రోజు బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. కారణం లేకుండా వివాదాలు జరిగే అవకాశం ఉంది.. మాట తూలకండి. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో, బయటి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రసంగం , ప్రవర్తనలో క్రమశిక్షణతో ఉండండి.


మీన రాశి (Pisces Horoscope Today) 


ఈ రోజు మీరు కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. విజయవంతమైన వ్యాపార ఒప్పందం ఉండవచ్చు. ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం, ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. బయటి వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.