January 2023 Monthly Horoscope in telugu: పాత ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదిలో కోటి ఆశలతో అడుగుపెడతారు. ఈ సమయంలో ఏడాదిలో మొదటి నెల జనవరి కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తే మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వగా ఓ రెండు రాశులవారికి నిరాశను మిగిల్చింది...ఆ రాశుల ఫలితాలు చూద్దాం.
వృషభ రాశి
2023లో మొదటి నెల మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు బావుంటాయి. ఆర్థిక సమస్యలుండవు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరాశి ఉద్యోగులు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి
మిథున రాశి
జనవరి నెల మిధున రాశి ఉద్యోగులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. సీనియర్లతో విభేదాలు ఉండవచ్చు. అనవసర వాదనలు పెట్టుకోవద్దు..అతిగా ఎవ్వర్నీ నమ్మొద్దు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టొద్దు. అనారోగ్యసమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలుంటాయి. కొన్ని విషయాల్లో అవమానాలు తప్పవు.
సింహ రాశి
జనవరి 2023 ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యాపారంలో లాభాలు మరియు కొన్నిసార్లు నష్టం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఈ రాశి ఉద్యోగులు నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. రానిబాకీలు వసూలవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
Also Read: 2023 ఈ నాలుగు రాశుల స్త్రీలకు కలిసొస్తుంది, మీరున్నారా ఇందులో!
ధనుస్సు రాశి
జనవరి 2023 ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు మాత్రం మిశ్రమ ప్రయోజనాలున్నాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఆస్తమా రోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. భూమి, ఇల్లు, వాహన క్రయ, విక్రయాలలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయి..మీరు తెలివిగా వ్యవహరించాలి. వాహనం జాగ్రత్తగా నడపాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ నెలలో పనిపై శ్రద్ధ తగ్గడంతో ఉన్నతాధికారులతో మాటలు పడకతప్పదు. పనిపై శ్రద్ధ వహించాలి. మీ పాత సహోద్యోగుల నుంచి మంచి ఆఫర్ పొందుతారు. గొప్పవారిని కలుసుకుంటారు వారిద్వారా లాభపడతారు. వ్యాపారులు వ్యాపారంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు బాధిస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
మీన రాశి
ఈ రాశి వారికి జనవరిలో వ్యాపారంలో లాభంతో పాటూ వ్యయం కూడా పెరుగుతుంది. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ దానిలో చాలా ఆటంకాలు ఉంటాయి. శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఉద్యోగ వృత్తికి సంబంధించిన వారైతే ప్రారంభంలో పనిభారం పెరుగుతుంది తర్వాత మీకు ఉపశమనం లభిస్తుంది. పని విషయంలో ప్రోత్సాహం ఉంటుంది. డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాలి.