New Year 2023 Wishes: కొత్తఏడాది ఆరంభం అద్భుతంగా ఉంటే ఏడాదంతా సంతోషంగా ఉంటామని భావిస్తారు చాలామంది. అందుకే న్యూ ఇయర్ ఎంట్రీని అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు..మరి శుభాకాంక్షలు చెప్పాలి అనగానే ఏదో అలా హ్యాపీ న్యూ ఇయర్ అనేస్తే ఎలా..అందుకే...విద్య, ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యం, దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్నిచ్చే కొన్ని శ్లోకాలు ఇక్కడ ఇస్తున్నాం..వీటిలో మీకు నచ్చిన శ్లోకాన్ని పంపించి శుభాకాంక్షలు తెలియజేయండి..

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ...నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా...ఈ ఏడాది మీరు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తికావాలిమీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యంభర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" గాయత్రీ దేవి అనుగ్రహం మీపై ఉండాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

‘‘ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభి ర్వాజినీవతీ ధీనామ విత్య్రవతు’’సరస్వతీ దేవి కరుణాకటాక్షాలు మీపై ఉండాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

Also Read: పదకొండు ఇంద్రియాలపై నియంత్రణే ఏకాదశి ఉపవాసం వెనుకున్న ఆంతర్యం!

‘ఓం గం గణపతియే నమ:’మీ మేధస్సు, జ్ఞాపకశక్తి మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ మీకు  మీ కుటుంబ సభ్యలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

‘ఓం ఐం వాగ్దేవాయై విద్మహే కమరాజ్యాయ దీమహే తన్నో దేవి ప్రచోదయాత్’చదువు పట్ల ఏకాగ్రత పెరగాలని ఆశీర్వదిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

‘శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:’ సమయస్ఫూర్తి వృద్ధి చెందాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

జహీ పర్ కృపా కరిన్ జాను జాని కబీ ఉర్ అజీర్ నచవ్విన్ బనిమోరి సుధాహరి సొసాబ్ భాంతి జాసు కృపా నహిన్ కృపన్ అఘాతి’మీ ఆత్మవిశ్వాసం మరింత పెరగాలని ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "జై శ్రీరామ్- మీకు,మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం || జై శ్రీ కృష్ణ -ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగునింపాలి

Also Read: వైకుంఠ ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదంటారు!

మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టంవాతాత్మజం వానర యోధ ముఖ్యంశ్రీ రామదూతం శరణం ప్రపద్యేహనుమాన్ కరుణాకటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూమీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్ ||కలిబాధల నుంచి విముక్తి కలగాలని కోరుతూమీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||ఆపదలు, ఇబ్బందుల నుంచి విముక్తి కలగాలిమీకు-మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||నవగ్రహ బాధల నుంచి విముక్తి కలగాలని కోరుతూనూతన సంవత్సర శుభాకాంక్షలు