Bhaum Pradosh Vrat Date 2025 : భౌమ ప్రదోష వ్రతం జూలై 8 or 9 ఎప్పుడు? ఈ రోజున పొరపాటున కూడా ఈ తప్పు చేయవద్దు!
మంగళవారం నాడు త్రయోదశి తిథి వచ్చినప్పుడు భౌమ ప్రదోష వ్రతం వస్తుంది. ఈ వ్రతం శివునితో పాటు మంగళ దేవుని అనుగ్రహం పొందడానికి చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చేసే ధార్మిక కార్యాలు రుణాల నుంచి విముక్తి కలిగిస్తాయి.
ఈ సంవత్సరం ఆషాఢ శుక్ల త్రయోదశి తిథి జూలై 08 మంగలవారం వచ్చింది. జూలై 7 అర్థరాత్రి మొదలైన తిథి జూలై 9 ఉదయం వరకూ ఉంది. జూలై 08 రోజుమొత్తం తిథి ఉంది. ఈ ఏడాది భౌమ ప్రదోష వ్రతం జూలై 8 మంగళవారమే
భౌమ ప్రదోష వ్రతం రోజున నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించకూడదు. ఎవరినీ అవమానించవద్దు. గోర్లు, దుట్టు కట్ చేసుకోవద్దు
ప్రదోష వ్రతం రోజున మహాదేవునికి నీటితో అభిషేకం చేస్తే అప్పుల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు
ఆదాయం పెరుగుతున్నా చేతిలో డబ్బులు నిలువకుంటే భౌమ ప్రదోష వ్రతం రోజు శివుడికి గులాబీపూలు సమర్పించండి
పంచామృతాలతో శివయ్యకు అభిషేకం చేస్తే మనశ్సాంతి, ఐశ్వర్యం లభిస్తుందని చెబుతారు పండితులు