8 Life Changing Secrets of Bhagavad Gita

మన జీవితంలో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది

కొన్నిసార్లు లక్ష్యాలతో యుద్ధం

మరికొన్నిసార్లు బంధుత్వాలతో యుద్ధం

ఇంకొన్నిసార్లు మనతోనే మనం యుద్ధం చేస్తుంటాం

కొన్నిసార్లు ప్రపంచం అంతా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది.. కానీ మనలో శాంతి ఉండదు ఏం జరుగుతోందో అర్థంకాదు..ఏం చేయాలో తెలియదు..

సమాధానం లేని ప్రశ్నలెన్నో..

మార్గం తెలియక మధ్యలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది సరిగ్గా ... మహాభారత కురుక్షేత్ర సంగ్రామ సమయంలో యుద్ధభూమిలో అర్జునుడు కూడా ఇలాగే నిలబడ్డాడు. విరిగిన మనస్సుతో, గందరగోళంతో.   అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు కేవలం ఒక యోధుడి కోసమో, యుద్ధాన్ని గెలిచేందుకో కాదు..జీవితంతో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.

ఈ 8 ఉపదేశాల్లో కేవలం ధర్మం మాత్రమే కాదు, జీవితానికి సంబంధించిన లెక్కలెన్నో ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి భయం, వైఫల్యం, కోపం, భ్రమ నుంచి బయటకు వచ్చేస్తారు..

ఇవే ఆ 8 కీలక విషయాలు 1. కోపం మిమ్మల్ని నాశనం చేస్తుంది

భగవద్గీత 2.63 ప్రకారం, కోపం భ్రాంతిని కలిగిస్తుంది, భ్రాంతి జ్ఞాపకశక్తిని నాశనం చేస్తుంది, జ్ఞాపకశక్తి లేకపోతే బుద్ధి నశిస్తుంది. బుద్ధి లేనివాడు నాశనాన్ని పొందుతాడు. నిజానికి కోపం మిమ్మల్ని ప్రతిదీ కోల్పోయే స్థితికి తీసుకొచ్చేస్తుంది..అవి సంబంధాలు, కెరీర్ , మీ ఆత్మగౌరవం ఏదైనా కావొచ్చు. 2. మనస్సును గెలిస్తే, అంతా గెలిచినట్లే

గీతా శ్లోకం 6.6 ప్రకారం, మనస్సును గెలిచిన వ్యక్తికి అది మిత్రుడిగా ఉంటుంది లేకపోతే శత్రువుగా ఉంటుంది. తన కోరికలు, భయాలు, నిరాశ  లోభంపై నియంత్రణ ఉంచుకున్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు.

3. మాట - మౌనం

తెలివితక్కువ వారు మాట్లాడటం ప్రారంభించినప్పుడు, తెలివైనవారు మౌనంగా ఉన్నప్పుడు అది వినాశనానికి దారితీస్తుంది. మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం ఎంత తప్పో..మాట్లాడాల్సిన సమయంలో మౌనం కూడా అంతే ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది

4. జ్ఞానం గొప్ప ఔషధం

నీరు అగ్నిని ఎలా చల్లబరుస్తుందో, అదేవిధంగా జ్ఞానం కోపం - ఆందోళనను శాంతింపజేస్తుంది. ధ్యానం, పఠనం, మౌనం ఇవన్నీ ఇందులో విభాగాలే 5. కోపాన్ని అణిచివేసుకోవద్దు

కోపాన్ని అణచివేయడం కన్నా సంయమనంతో వ్యక్తపరచడం మంచిది. మీలోపల మండుతున్నది నెమ్మదిగా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది ఎప్పుడో అప్పుడు పేలిపోయేలా భగ్గు మంటుంది. 

6. నరకానికి 3 ద్వారాలు

త్రివిధ నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్. (గీత 16.21).. కోరిక, కోపం, లోభం ఈ మూడింటినీ నియంత్రించలేనివాడు తనను తానే నాశనం చేసుకుంటాడు.

7. కర్మ ఆగిపోతే, విధి కూడా ఆగిపోతుంది

ఇప్పుడు నా విధి బాగాలేదని ఎవరైతే అంటారో విధి ఏర్పడేదే కర్మతో అనే విషయాన్ని మర్చిపోయినట్టే... మీ కర్మలను ఆచరించడం ఎప్పుడూ మానేయకూడదు

8.కోరికలు ఎప్పటికీ తీరవు

కోర్కెలు లేని వ్యక్తి ఉండడు..కానీ ఆ కోర్కెకు సంతృప్తి అనేది కూడా తోడవ్వాలి. సంతృప్తి లేనివారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

ఇది కేవలం గీతలో ఒక వాక్యం మాత్రమే కాదు ఇదే జీవితాన్ని నడిపించే మార్గం

కెరీర్‌లో అనిశ్చితి - కర్మ చేయండి, ఫలితం గురించి చింతించకండిసంబంధాలలో తగాదాలు - కోపాన్ని అదుపులో ఉంచుకోండి, సంయమనం పాటించండిస్వీయ పోరాటం - మనస్సును గెలుచుకోండి, అదే నిజమైన విజయంలక్ష్యానికి ఆటంకం - కర్మ ద్వారానే విధి ఏర్పడుతుంది

ఈ సూత్రాలను నేటి తరం అనుసరిస్తే  మానసిక ఒత్తిడి, సంబంధాల మధ్య గందరగోళం ,  నిర్ణయాల్లో అస్థిరతకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తాయి. అన్నిటికిన్నా మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి గమనిక: గ్రంధాల నుంచి సేకరించిన, ఆధ్యాత్మికవేత్తలు అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది , విశ్వశించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.