Shravan Food Guide :  శ్రావణమాసంలో శ్రీ మహాలక్ష్మి పూజ, వరలక్ష్మీవ్రతంతో పాటూ శివారాధనకు కూడా అత్యుత్తమం. శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు ఎంత ముఖ్యమో సోమవారాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. 

శ్రావణమాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి పూజ చేస్తారు..ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ నిర్వహిస్తారు..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారుమంగళవారం, శుక్రవారంతో పాటూ ప్రతి సోమవారం శివారాధనకు అత్యంత ప్రధానంగా భావిస్తారు

అయితే శక్తి పూజ, శివారాధన చేసేవారు తమ ఇంద్రియాలను నియంత్రించినప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. కార్తీకమాసం తర్వాత శ్రావణమాలంలో నెల రోజులూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో ఇంద్రియాలపై ప్రభావం చూపే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణంపై ప్రభావం పడుతుంది. అదే సమయంలో ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే ఈ శ్రావణంలో చేసే పూజలు ఫలించాలంటే ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతారు. శ్రావణమాసంలో పాలు, మాంసాహారం, ఆకుకూరలు తీసుకోకూడదని చెబుతారు.

శ్రావణమాసంలో ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగానూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  వర్షాకాలం కావడంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనం వెల్లివిరుస్తుంది. ఈ నెలలో వాతావరణంలో మార్పులొస్తాయి. అంటువ్యాధులు తొందరగా ప్రబలే సమయం. అందుకే పాలు, ఆకుకూరలు తీసుకోవద్దని చెబుతారు. దీనివెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు శాస్త్రీల కారణాలూ ఉన్నాయి

శ్రావణమాసంలో పరమేశ్వరుడి ఆరాధనతో పాటూ కొందరు ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం చేసే సమయంలో కొందరు పాలు, పండ్లు తీసుకుంటారు. ఈ నెలలో పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేయదని చెబుతారు. మిగిలిన సీజన్లలో కన్నా వనాకాలంలో పాలల్లోకి సూక్ష్మక్రిములు ఎక్కువగా ప్రవేశిస్తాయని..ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు. నేలలో ఉండే చాలా పురుగులు వానల కారణంగా గడ్డిపై చేరుతాయి. ఈ గడ్డి తిన్న పశువులు ఇచ్చే పాలు అనారోగ్యానికి గురిచేస్తాయి

వానాకాలంలో పచ్చదనం పెరుగుతుంది..ఆకుకూరులు గుబురుగా పెరుగుతాయి. ఇదే సమయంలో వాటిలో పురుగులు, సూక్ష్మక్రిములు కూడా బలపడతాయి. ఇవన్నీ ఆకుకూరల్లో ప్రవేశిస్తాయి. శ్రావణమాసంలో ఆకుకూరలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు, అంటురోగోలా బారిన పడతారు.   

వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఈ సమయంలో జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది. ఉల్లిపాయ, ఆవాల ఆకుకూర, బ్రోకలీ, వాటర్ క్రెస్, చికరీ, క్యాబేజీ,  పుదీనా, కొత్తిమీర, మెంతి, ముల్లంగి ఆకులు శ్రావణంలో తినకూడదు. ఆకుకూరల బదులు  సొరకాయ,  గుమ్మడికాయ సహా  శరీరంలో వేడిని పెంచే ఇతర కూరగాయలు తీసుకోవాలి.

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు  ఆధారంగా సేకరించింది మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. అనుసరించే ముందు మీరు విశ్వసించే నిపుణులు, పండితుల సలహాలు స్వీకరించండి.